Wipro: ఫ్రెషర్లకు సగం జీతాలు కట్ చేసిన విప్రో.. అన్యాయమంటున్న ఐటీ ఉద్యోగుల సంఘం

విప్రో సంస్థ గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని ఫ్రెషర్లుగా తీసుకుంది. వీరికి కంపెనీ శిక్షణ ఇచ్చింది. ట్రైనింగ్ పూర్తైన వాళ్లంతా ఆన్‌బోర్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి మొదట రూ.6.5 లక్షల వార్షిక వేతనాన్ని సంస్థ ప్రకటించింది. అయితే, ఇప్పుడు రూ.3.5 లక్షల వేతనానికే పని చేయాలని కంపెనీ కోరింది.

Wipro: ఫ్రెషర్లకు సగం జీతాలు కట్ చేసిన విప్రో.. అన్యాయమంటున్న ఐటీ ఉద్యోగుల సంఘం

Wipro: తమ సంస్థలో చేరిన ఫ్రెషర్లకు ఐటీ సంస్థ విప్రో షాకిచ్చింది. వేతనాల్లో 50 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఐటీ ఉద్యోగుల సంఘం (ఎన్ఐటీఈఎస్) మండి పడుతోంది. విప్రో తన నిర్ణయం మార్చుకోవాలని ఆ సంఘం డిమాండ్ చేస్తోంది.

Visakha Beach Clean : మందుబాబుల కిక్కు దించిన విశాఖ కోర్టు.. ఎలాంటి శిక్ష విధించిందంటే

బెంగళూరుకు చెందిన విప్రో సంస్థ గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని ఫ్రెషర్లుగా తీసుకుంది. వీరికి కంపెనీ శిక్షణ ఇచ్చింది. ట్రైనింగ్ పూర్తైన వాళ్లంతా ఆన్‌బోర్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి మొదట రూ.6.5 లక్షల వార్షిక వేతనాన్ని సంస్థ ప్రకటించింది. అయితే, ఇప్పుడు రూ.3.5 లక్షల వేతనానికే పని చేయాలని కంపెనీ కోరింది. ఈ ఒప్పందానికి అంగీకరించిన వాళ్లు ఉద్యోగాల్లో చేరొచ్చని కంపెనీ ఫ్రెషర్లకు పంపిన మెయిల్‌లో పేర్కొంది. ఈ ఏడాది మార్చి నుంచి వీళ్లు విధుల్లో చేరాల్సి ఉంది. అయితే, మొదట ప్రకటించినట్లుగా కాకుండా ఇప్పుడు దాదాపు సగం వేతనానికే పనిచేయాలని కోరడంపై ఐటీ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

TDP Pattabhi Ram: టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్.. గన్నవరం ఘర్షణల కేసులో కోర్టు ఆదేశం

ఈ నిర్ణయం సరికాదని అభిప్రాయపడింది. ‘విప్రో తీసుకున్న నిర్ణయం అన్యాయం. అనైతికం. ఇది అంగీకారయోగ్యం కాదు. ఉద్యోగులను సంప్రదించకుండా, వాళ్లతో చర్చించకుండా వేతనాల్లో కోత విధించడం సరికాదు. పారదర్శకత, కచ్చితత్వానికి ఇది వ్యతిరేకం. కంపెనీకి సంబంధించిన ఆర్థిక సమస్యల్ని పూర్తిగా ఉద్యోగుల భుజాలపై వేయడం సరికాదు. ఈ నిర్ణయంపై విప్రో పునరాలోచన చేయాలి. తన నిర్ణయాన్ని కంపెనీ మార్చుకోవాలి’’ అని ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా డిమాండ్ చేశారు.

కొందరు ఫ్రెషర్లను ఇలా సగం వేతనానికే పని చేయాలని కోరిన విప్రో.. గతంలో చాలా మంది ఫ్రెషర్లను తొలగించింది. గత డిసెంబర్, జనవరిల్లో కొందరు ఫ్రెషర్లు సరైన ప్రతిభ కనబర్చలేదనే కారణంతో తొలగించింది. ఇటీవలే 425 మందికిపైగా ఫ్రెషర్లను కంపెనీ తొలగించినట్లు తెలుస్తోంది.