TDP Pattabhi Ram: టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్.. గన్నవరం ఘర్షణల కేసులో కోర్టు ఆదేశం

గన్నవరం ఘర్షణల కేసులో సోమవారం పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళవారం పట్టాభిని, మరో పది మంది టీడీపీ నేతలను పోలీసులు గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా జడ్జి ముందు పట్టాభి తన వాంగ్మూలం ఇచ్చారు.

TDP Pattabhi Ram: టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్.. గన్నవరం ఘర్షణల కేసులో కోర్టు ఆదేశం

TDP Pattabhi Ram: కృష్ణా జిల్లా గన్నవరం ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసులో గన్నవరం కోర్టు టీడీపీ నేత పట్టాభి రామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభితోపాటు మరో 10 మంది టీడీపీ నేతలకు కూడా కోర్టు రిమాండ్ విధించింది. పట్టాభికి చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించాలని జడ్జి ఆదేశించారు.

Anonymous Donor: చిన్నారికి అరుదైన జబ్బు.. చికిత్సకు రూ.11 కోట్లు దానం చేసిన గుర్తు తెలియని వ్యక్తి

వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. గన్నవరం ఘర్షణల కేసులో సోమవారం పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళవారం పట్టాభిని, మరో పది మంది టీడీపీ నేతలను పోలీసులు గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా జడ్జి ముందు పట్టాభి తన వాంగ్మూలం ఇచ్చారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ముసుగులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆయన జడ్జికి తెలిపారు. అరగంటపాటు కాళ్లు, చేతులపై కొట్టినట్లు ఆయన కోర్టులో చెప్పారు.

AP New Governor: ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు

దీనిపై విచారణ జరిపిన జడ్జి తాజా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు టీడీపీ నేత పట్టాభి ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. పట్టాభి భార్య, కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పట్టాభిపై కేసు నమోదు చేశారు. పట్టాభితోపాటు టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, తనకు ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని కనకారావు ఫిర్యాదు చేశారు. దీంతో పట్టాభి, చిన్నా సహా పలువురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.