AP New Governor: ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు

ఇప్పటివరకు ఏపీ గవర్నర్‌గా కొనసాగిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. దీంతో నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.

AP New Governor: ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు

AP New Governor: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమిస్తూ ఇటీవలే కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 24న జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరిస్తారు.

Anonymous Donor: చిన్నారికి అరుదైన జబ్బు.. చికిత్సకు రూ.11 కోట్లు దానం చేసిన గుర్తు తెలియని వ్యక్తి

ఇప్పటివరకు ఏపీ గవర్నర్‌గా కొనసాగిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితోపాటు పలువురు నేతలు, అధికారులు బిశ్వభూషణ్‌ హరిచందన్‌‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. మూడేళ్లు ఆయన ఏపీ అభివృద్ధికి ఎంతో సహకరించారని సీఎం ప్రశంసించారు. ఒక పెద్దలా, తండ్రిలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి బిశ్వభూషణ్ అండగా నిలిచారన్నారు. ఆయనతో తనకున్న అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని సీఎం గుర్తు చేశారు.

CM Nitish Kumar: ఇదేమైనా ఇంగ్లండ్ అనుకున్నావా? ఇంగ్లీష్‌లో మాట్లాడిన అధికారిపై బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం

నూతన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆంధ్ర ప్రదేశ్‌కు రానున్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి బయల్దేరి కుటుంబంతో అమరావతి చేరుకుంటారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసి, గత నెలలోనే రిటైర్ అయ్యారు. పదవీ విరమణ పొందిన నెల రోజుల్లోనే ఆయనకు కేంద్రం గవర్నర్ పదవి ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ కీలక తీర్పులు ఇచ్చారు.