Visakha Beach Clean : మందుబాబుల కిక్కు దించిన విశాఖ కోర్టు.. ఎలాంటి శిక్ష విధించిందంటే

మందుబాబులకు విశాఖ కోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. తాగింది దిగేలా, మరెప్పుడూ తాగొద్దనేలా ఝలక్ ఇచ్చింది. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ మందుబాబులకు వినూత్న శిక్ష వేసింది విశాఖ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు. బీచ్ లో వ్యర్ధాలను ఏరివేయాలని, బీచ్ ను శుభ్రం చేయాలని కోర్టు ఆదేశించింది. విశాఖలో మూడు రోజుల్లో డ్రంకన్ డ్రైవ్ లో 50మంది పట్టుబడ్డారు.

Visakha Beach Clean : మందుబాబుల కిక్కు దించిన విశాఖ కోర్టు.. ఎలాంటి శిక్ష విధించిందంటే

Visakha Beach Clean : మందుబాబులకు విశాఖ కోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. తాగింది దిగేలా, మరెప్పుడూ తాగొద్దనేలా ఝలక్ ఇచ్చింది. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ మందుబాబులకు వినూత్న శిక్ష వేసింది విశాఖ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు. బీచ్ లో వ్యర్ధాలను ఏరివేయాలని, బీచ్ ను శుభ్రం చేయాలని కోర్టు ఆదేశించింది. విశాఖలో మూడు రోజుల్లో డ్రంకన్ డ్రైవ్ లో 50మంది పట్టుబడ్డారు.

Also Read..Kochi police: వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు .. మద్యం మత్తులో బస్సులు నడిపిన డ్రైవర్లకు పోలీసులు వింత శిక్ష..

విశాఖలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. 50 మంది మందుబాబులను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయమూర్తి వారికి విభిన్నమైన శిక్ష విధించారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో చెత్తను ఏరివేయడమే మీకు విధిస్తున్న శిక్ష అని పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్ లోని చెత్తను ఏరివేస్తుండాలని స్పష్టం చేశారు.

దాంతో, పోలీసులు ఆ మందుబాబులను బీచ్ కు తీసుకెళ్లారు. వారితో చెత్త ఏరివేత కార్యక్రమం ప్రారంభిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యాయమూర్తి భలే మంచి తీర్పు ఇచ్చారు, మంచి శిక్ష విధించారు, తాగుబోతుల తిక్క కుదిర్చారు, మందుబాబుల కిక్కు దిగేలా పనిష్ మెంట్ ఇచ్చారని స్థానికులు మెచ్చుకున్నారు. ఇలాంటి శిక్షలతో అయినా వారిలో మార్పు రావాలని, మరోసారి ఇలాంటి తప్పు చేయకూడదని ఆకాంక్షించారు.

Also Read..Goa New Rules : గోవా వెళ్లే వారికి షాక్.. ఇకపై ఆ పనులు చేస్తే కఠిన చర్యలు, రూ.50వేలు జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం. తాగి వాహనంతో రోడ్డెక్కడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. వారి ప్రాణాలకే కాదు ఎదుటి వారి ప్రాణాలకు కూడా రిస్కే. తాగిన మత్తులో వాహనం డ్రైవ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుంది. ఒక్కోసారి ప్రాణం పోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏ తప్పు చేయని అమాయకులు బలైపోతున్నారు. తాగిన మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా, కఠిన శిక్షలు వేస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రాకపోవడం బాధాకరం. మద్యం తాగి వాహనాలతో రోడ్డెక్కుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.