Kochi police: వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు .. మద్యం మత్తులో బస్సులు నడిపిన డ్రైవర్లకు పోలీసులు వింత శిక్ష..

మద్యం సేవించి వాహనం నడిపిన 16 మంది బస్సు డ్రైవర్లకు కొచ్చి పోలీసులు వింత శిక్ష విధించారు. స్టేషన్ లో కూర్చోబెట్టి వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు. వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించి వదిలేస్తారనుకుంటే పొరపాటే. ఇంపోజిషన్‌తో పాటు నిబంధనలు అతిక్రమించినందుకు అసలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేశారు

Kochi police: వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు .. మద్యం మత్తులో బస్సులు నడిపిన డ్రైవర్లకు పోలీసులు వింత శిక్ష..

Kochi police

Kochi police: మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుంటారు. అలాంటి వారికి ఫైన్లు విధిస్తూ.. ఒక్కోసారి జైలు శిక్షలు పడుతుండటం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయినా, కొందరు మందుబాబులు మద్యం సేవించి వాహనం నడిపి పలు ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనలు కోకొల్లలు. ఇలాంటి మందు బాబులకు కేళరలోని కొచ్చి పోలీసులు షాకిచ్చారు. వాహన తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి వారిని స్టేషన్‌కు తరలించి వింత పరీక్ష పెట్టారు.

UP Police Crying For Food: భోజనం బాగోలేదని రోడ్డుపైకొచ్చి ఏడ్చిన పోలీస్.. వైరల్‌గా మారిన వీడియో ..

గతవారం కొచ్చిలో ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకొని మద్యం సేవించి వాహనం నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.  పోలీసులు తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కొరడా ఝుళిపించారు. అయితే, త్రిపుణితుర హిల్ ప్యాలెస్ పోలీసులు తనిఖీల్లో భాగంగా 16 మంది బస్సు డ్రైవర్లను అందుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్ కు తరలించి శిక్ష విధించారు. వారికి పెన్ను, పేపర్ ఇచ్చి వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు. ‘ఇకపై తాగి డ్రైవింగ్ చేయను’ అని వారితో వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు.

Kerala Police:కేరళ పోలీసుల క్రియేటివిటీ అదుర్స్, నవ్వులు పూయిస్తున్న రవిశాస్త్రి ట్రేసర్ బుల్లెట్

వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించి వదిలేస్తారనుకుంటే పొరపాటే. ఇంపోజిషన్‌తో పాటు నిబంధనలు అతిక్రమించినందుకు అసలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులకు పట్టుబడిన వారిలో నలుగురు స్కూల్ బస్సు డ్రైవర్లు, ఇద్దరు కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, 10 మంది ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఉన్నారు. ఈ విషయంపై నగర డిప్యూటీ కమిషనర్ శశిధరన్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, నడిపిన వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇదిలాఉంటే, మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడిన డ్రైవర్లను స్టేషన్‌లో వరుసగా కూర్చోబెట్టి పేపర్లపై పోలీసులు ఇంపోజిషన్ రాయించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.