Goa New Rules : గోవా వెళ్లే వారికి షాక్.. ఇకపై ఆ పనులు చేస్తే కఠిన చర్యలు, రూ.50వేలు జరిమానా

నిన్నటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఇకపై గోవా బీచ్ లలో ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చాయి.

Goa New Rules : గోవా వెళ్లే వారికి షాక్.. ఇకపై ఆ పనులు చేస్తే కఠిన చర్యలు, రూ.50వేలు జరిమానా

Goa New Rules : గోవా.. దేశంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాల్లో టాప్ లో ఉన్న ప్రాంతం. దేశ, విదేశాల నుంచి నిత్యం గోవాకు టూరిస్టులు వెళ్తుంటారు. అక్కడి వెదర్ ని, ప్రకృతి అందాలను అంతా ఆస్వాదిస్తారు. ఇక గోవాలోని బీచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీచ్ లలో మస్తు ఎంజాయ్ చేస్తారు. బీచ్ లలో పార్టీలు చేసుకుంటారు. మందు తాగుతూ చిల్ అవుతారు. అయితే, నిన్నటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఇకపై గోవా బీచ్ లలో ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చాయి.

గోవాలో ఇకపై కొన్ని టూరిస్ట్ కార్యకలాపాలను నిషేధించారు. పర్యాటకులు ఇంతకుముందులా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఫేస్ చేయక తప్పదు. దీంతో ఇకపై గోవాకు వెళ్లాలనుకునే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. టూరిస్టులకు మంచి అనుభవాలు మిగిల్చేందుకు గోవా ప్రభుత్వం కొత్తగా కొన్ని కార్యకలాపాలను నిషేధించింది. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

ఇప్పటివరకు గోవాలోని బీచ్ లలలో మద్యం సేవించేందుకు అడ్డంకులు ఉండేవి కాద. కానీ, తాజాగా గోవా ప్రభుత్వం.. పర్యాటన ప్రదేశాలలో బహిరంగంగా మద్యం సేవించడం, మందు బాటిళ్లను పగలకొట్టడం పూర్తిగా నిషేధం విధించింది. అంతేకాదు.. అనుమతులు లేని వాటర్ స్పోర్ట్స్ ఆటల టికెట్లను అమ్మడం కూడా నిషేధమే. ఈ రూల్స్ ను ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.5వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సహజంగా చాలా మంది టూరిస్టులు గోవాకు వెళ్లినప్పుడు రోడ్ల పక్కన, బీచ్‌లలో వంటలు చేసుకొని ఆరగించడం చూస్తుంటాం. అలాగే కొందరు మద్యం కూడా తాగుతుంటారు. అలాంటి కార్యకలాపాలపైనా కచ్చితమైన నిబంధనలు తీసుకొచ్చింది. ఎవరైనా టూరిస్టులు ఇకపై బీచ్‌లలో లేదా ఇతర ప్రదేశాల్లో వంటలు చేసుకోవడం, మద్యం తాగడం లాంటివి చేస్తే భారీ జరిమానాలు విధిస్తారు.

ఇక ఈ ఏడాది జూలై 1 నుండే గోవాలో ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని విధించింది. దీంతో ఏదైనా యూజ్ అండ్ త్రో వంటి ప్లాస్టిక్ వస్తువులు లేదా కవర్లు వాడినా చర్యలు తప్పవు. అలాగే ప్లాస్టిక్ వస్తువులను నిల్వ చేయడం, తయారు చేయడం, విక్రయించడం కూడా నేరమే. దీంతో టూరిస్టులు వాటర్ బాటిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

గోవాకు వచ్చే పర్యాటకులతో పాటు స్థానికులు కూడా కొన్ని కార్యకలాపాలు సాగించడంతో గోవా టూరిజానికి చెడ్డ పేరు వస్తోంది. ఈ నేపథ్యంలోనే గోవా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. పర్యాటకులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు గోవా పర్యాటక శాఖ అన్ని బీచ్‌లలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

గోవా బీచ్‌లలో ఎటు చూసినా పర్యాటకులు విశ్రాంతి తీసుకొనేందుకు చెక్కలతో నిర్మించిన డెక్-బెడ్‌లే కనిపిస్తుంటాయి. అక్కడ ఉండే దుకాణాదారులు వాటిని అనధికారికంగా ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షిస్తుంటారు. అలాంటి వాటిని సైతం గోవా ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రకటించింది. దీంతో టూరిస్టులు ఎవరైనా అలాంటి సదుపాయాలు పొందాలంటే అధికారిక అనుమతులు ఉన్న ప్రదేశాల్లోనే పొందాలి.

గోవాలో కొత్త నిబంధనలు ఇవే..

* బీచ్‌లో చెత్త వేయటం, మద్యం తాగడం, తాగి పడేసే బాటిళ్లను పగలగొట్టటం నేరం.
* ఇకపై బీచ్‌లో డ్రైవింగ్‌ చేయకూడదు. బహిరంగ ప్రదేశంలో వంట వండటం నిషేధం.
* టూరిస్టులతో పాటు వారికి సేవలందిస్తున్న వివిధ సంస్థలు, వ్యాపారస్తులకు సైతం కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
* వాటర్‌ స్పోర్ట్స్‌ కేవలం గుర్తింపు పొందిన ప్రాంతాల్లోనే నిర్వహించాలి.
* గుర్తింపు పొందిన కౌంటర్ల వద్దే టిక్కెట్లు కొనాలి.
* తోపుడి బండిపై వ్యాపారం చేసే వారు పర్యాటకులకు అడ్డుపడితే జరిమానా.
* ఎవరైనా టూరిస్టులను డబ్బులు అడగడం, అల్లర్లు సృష్టించటం చేస్తే చర్యలు.
* నిబంధనలను అతిక్రమించిన వారికి రూ.5వేల నుంచి రూ.50వేల వరకు ఫైన్.