Andhra Pradesh: తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలకు గుణపాఠం.. వృద్ధురాలైన తల్లిని వేధిస్తున్న కొడుకు, కోడలికి జైలు శిక్ష

వృద్ధాప్యంలో ఉన్న తల్లిని వేధింపులకు గురి చేసిన కొడుకు-కోడలికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సూర్య తేజ ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేశారు.

Andhra Pradesh: తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలకు గుణపాఠం.. వృద్ధురాలైన తల్లిని వేధిస్తున్న కొడుకు, కోడలికి జైలు శిక్ష

Andhra Pradesh: తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి రాగానే వాళ్లను నిర్లక్ష్యం చేసే పిల్లలు చాలా మంది ఉంటారు. కొడుకు-కోడలు, కూతురు-అల్లుడు తల్లిదండ్రుల్ని పట్టించుకోరు. అంతేకాదు.. వారిపై దాడులు చేస్తూ, వేధింపులకు కూడా పాల్పడుతుంటారు. అలాంటి వారికి గుణపాఠం నేర్పేలా తాజా తీర్పు వెలువడింది.

Wipro: ఫ్రెషర్లకు సగం జీతాలు కట్ చేసిన విప్రో.. అన్యాయమంటున్న ఐటీ ఉద్యోగుల సంఘం

వృద్ధాప్యంలో ఉన్న తల్లిని వేధింపులకు గురి చేసిన కొడుకు-కోడలికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సూర్య తేజ ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేశారు. పుల్లూరి నాగమణి అనే వృద్ధురాలిని ఆమె కొడుకు వెంకన్న, కోడలు రేవతి వేధింపులకు గురి చేశారు. ఆమె సంరక్షణ కూడా చూడలేదు. దీనిపై ట్రిబ్యునల్ కోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో వెంకన్న-రేవతి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దీంతో కోర్టు వారికి శిక్ష విధించింది.

2007, పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఇద్దరికీ రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కొడుకు-కోడలు ఉంటున్న ఇంటిని స్వాధీనం చేసుకుని, తల్లి నాగమణికి ఆ ఇల్లు అప్పగించాలని ఆదేశించింది. ఇంటికి సంబంధించి ఒక పోర్షన్ అద్దెకిచ్చి, ఆ అద్దె ద్వారా నాగమణి జీవనం గడిచేలా చూడాలని ఆదేశించింది. తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతను ఉల్లంఘిస్తే, శిక్ష తప్పదని సబ్ కలెక్టర్ సూర్య తేజ హెచ్చరించారు.