AP Government : ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైన ఏపీ సర్కార్

ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధమైంది. కేంద్ర హోంశా ఆదేశాలతో సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపికి సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

AP Government : ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైన ఏపీ సర్కార్

IPS SUNIL

AP Government : ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధమైంది. కేంద్ర హోంశా ఆదేశాలతో సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపికి సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సునీల్ కుమార్ పై తగిన చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని డీజీపీకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. హిందూత్వానికి వ్యతిరేకంగా, హిందూ దేవతలకు వ్యతిరేకంగా సునీల్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశారని మొదటగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్రానికి లేఖ రాసి దర్యాప్తు చేశారు.

దానిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టు న్యాయవాది కూడా ఈ విషయంపై పిటిషన్ దాఖలు చేయడంతోపాటు ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలకు సిద్ధమైంది. కేంద్రం ఆదేశాల మేరకు సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన నివేదికను కూడా ఇవ్వాలని డీజీపీకి సీఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు.

AP CID Chief Transfer : హాట్ టాపిక్‌గా జగన్ సర్కార్ నిర్ణయం.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ వెనుక ఆంతర్యం ఏంటి?

ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు సునీల్ కుమార్ పై ఆరోపణలు చేస్తున్నాయి. సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని ఆయనపై రఘురాం కృష్ణంరాజు చేసిన ఫిర్యాదు అయితేనేమీ, దీనిపై సీఎం జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.