AP CID Chief Transfer : హాట్ టాపిక్‌గా జగన్ సర్కార్ నిర్ణయం.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ వెనుక ఆంతర్యం ఏంటి?

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. రాజధాని భూములు, సోషల్ మీడియా పోస్టులు సహా ఎన్నో కేసుల విషయంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి ఎందుకు తప్పించారు అన్నది హాట్ టాపిక్ అయ్యింది.

AP CID Chief Transfer : హాట్ టాపిక్‌గా జగన్ సర్కార్ నిర్ణయం.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ వెనుక ఆంతర్యం ఏంటి?

AP CID Chief Transfer : ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ అయ్యారు. సీఐడీ ఏడీజీగా ఎన్ సంజయ్ ను నియమించారు. అటు విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా సంజయ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సునీల్ కుమార్ ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. పలు కీలక కేసులను డీల్ చేస్తున్న సునీల్ కుమార్ బదిలీ కావడం హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ప్రస్తుతం విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా పని చేస్తున్న సంజయ్ కు సీఐడీ బాధ్యతలను అదనంగా కట్టబెట్టింది. రాజధాని భూములు, సోషల్ మీడియా పోస్టులు సహా ఎన్నో కేసుల విషయంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి ఎందుకు తప్పించారు అన్నది హాట్ టాపిక్ అయ్యింది.

Also Read..Chintakayala Vijay : నా ఇంట్లోకి చొరబడి నా కూతురిని బెదిరించారు- సీఐడీ పోలీసులపై చింతకాయల విజయ్ ఆరోపణలు

సునీల్ కుమార్ 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1995లో పులివెందుల ఏఎస్పీగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో కీలకమైన పోస్టుల్లో పని చేశారు. ఏడీజీ హోదాలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సునీల్ కుమార్ ను.. జనవరి 1న ఆయనకు డీజీ ర్యాంకు ప్రమోట్ చేసింది ఏపీ సర్కార్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఐడీ, సునీల్ కుమార్ పేర్లే ఎక్కువగా వినిపించాయి. అలాంటిది ఆయనను ఆకస్మికంగా జీఏడీకి బదిలీ చేయడం వెనుక పెద్ద కారణమే ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేయడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సీఐడీ చీఫ్ గా నియామకం అయినప్పటి నుంచి కూడా సునీల్ కుమార్.. కీలకమైన కేసులను దర్యాఫ్తు చేస్తున్నారు. రాజధాని భూముల కేసు, సోషల్ మీడియా పోస్టుల కేసు, రఘురామకృష్ణ రాజు కేసు, టీడీపీ నేతలకు సంబంధించిన అనేక కేసులు, మాజీ మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడల కేసులు కూడా సునీల్ కుమార్ దర్యాఫ్తు చేస్తున్నారు. ఇప్పటివరకు కీలకమైన కేసులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేయడం జరిగింది.

Also Read..Chintakayala Vijay Case : కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారు? చింతకాయల విజయ్ కేసులో CIDపై హైకోర్టు సీరియస్

సీఐడీ.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సునీల్ కుమార్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వచ్చారు. సీఎం జగన్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా, సన్నిహితుడిగా సునీల్ కుమార్ పై ముద్ర పడింది. అందుకే కీలకమైన కేసులన్నింటిని సునీల్ కుమార్ కు అప్పగించినట్లు ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సునీల్ కుమార్ బదిలీ చేసి జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇది సాధారణ బదిలీలో భాగంగా జరిగిందా? లేదా సునీల్ కుమార్ కు జగన్ ప్రభుత్వం మరో కీలక బాధ్యత అప్పగించనుందా? అనేది తెలియాల్సి ఉంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.