Chintakayala Vijay : నా ఇంట్లోకి చొరబడి నా కూతురిని బెదిరించారు- సీఐడీ పోలీసులపై చింతకాయల విజయ్ ఆరోపణలు

సీఐడీ పోలీసులు తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని, తన కుమార్తెను బెదిరించారని, డ్రైవర్ ను కొట్టారని సంచలన ఆరోపణలు చేశారు చింతకాయల విజయ్.

Chintakayala Vijay : నా ఇంట్లోకి చొరబడి నా కూతురిని బెదిరించారు- సీఐడీ పోలీసులపై చింతకాయల విజయ్ ఆరోపణలు

Chintakayala Vijay : టీడీపీ నేత చింతకాయల విజయ్.. ఏపీ సీఐడీకి లేఖ రాశారు. సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో ఎలాంటి వివరాలూ లేవన్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ, క్రిమినల్ కేసు వివరాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీఐడీ పోలీసులు తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని, తన కుమార్తెను బెదిరించారని, డ్రైవర్ ను కొట్టారని సంచలన ఆరోపణలు చేశారు చింతకాయల విజయ్.

విజయ్ రాసిన లేఖను ఆయన అడ్వకేట్.. గుంటూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఇచ్చేందుకు ప్రయత్నించారు. 4 గంటలు వేచి చూసినా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంలో లేఖను సీఐడీ కార్యాల‌యంలోని త‌పాలా విభాగానికి అంద‌జేశారు. ఇక విజయ్ కు ఇచ్చిన నోటీసులు చెల్లవని అడ్వొకేట్ కోటేశ్వరరావు అన్నారు. విజయ్ కుటుంబసభ్యులకు ఇవ్వలేదన్నారు. పని మనుషులకు నోటీసులు ఇస్తే ఎలా చెల్లుతుందన్నారు. కేసుకు సంబంధించిన వివరాలేవీ ఇవ్వలేదని చెప్పారాయన.

విజ‌య్‌కు సీఐడీ ఇచ్చిన నోటీసులు అస‌లు చెల్లుబాటు కావ‌ని ఈ సంద‌ర్భంగా విజ‌య్ త‌ర‌ఫు న్యాయవాదులు తేల్చి చెప్పారు. నిందితుడికి గానీ, నిందితుడి కుటుంబ స‌భ్యులకు ఇచ్చే నోటీసులు మాత్ర‌మే చెల్లుబాటు అవుతాయ‌న్నారు. విజ‌య్ డ్రైవ‌ర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్ల‌వ‌న్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”అసలు నోటీసులే ఇవ్వలేదు. నోటీసులు ప్రాపర్ గా ఇవ్వలేదు. 41ఏ నోటీసులు..అంటే కుటుంబసభ్యులకు ఇవ్వాలి. విజయ్ కు ఇవ్వాలి లేదా ఆయన భార్యకు ఇవ్వాలి లేదా విజయ్ తండ్రికి ఇవ్వాలి లేదా మదర్ కో, బ్రదర్ కో ఇవ్వాలి. అంతేకానీ, పని మనుషులకు ఇస్తే చెల్లదు. ప్రాపర్ నోటీసు అనేది లేదు. సీఐడీ అధికారులు హంగామా చేశారు.

చింతకాయల విజయ్ ఏ కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు అనే సమాచారం ఆయనకు ఇస్తే దానికి అనుగుణంగా ఆయన తన లాయర్ తో మాట్లాడుకుని విచారణకు రావడమా, సమాధానం ఇవ్వడమా అనేది నిర్ణయిస్తారు. ఈ కేసులో నేను రియాక్ట్ అయ్యే ముందు నాకు సమాచారం ఇవ్వండి అనేది విజయ్ వాదన. నేను ఈ కేసులో ప్రాపర్ గా రియాక్ట్ అయ్యి, మీకు సహకరించాలంటే, మీ దగ్గరకు రావడానికి నాకు ముందు సరైన సమాచారం కావాలన్నది విజయ్ మాట” అని చింతకాయల విజయ్ తరపు న్యాయవాది అన్నారు.

సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని విజ‌య్ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయ‌న ఇంట్లో లేక‌పోవ‌డంతో విజ‌య్ డ్రైవ‌ర్‌కు నోటీసులు అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా విజ‌య్ ఇంట్లో సీఐడీ అధికారుల తీరుపై విజ‌య్‌తో పాటు టీడీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసు ఏమిటో చెప్ప‌కుండా విచార‌ణ‌కు ర‌మ్మంటే ఎలా వెళ‌తా అని చింత‌కాయ‌ల విజ‌య్ ప్రశ్నిస్తున్నారు.