Chintakayala Vijay Case : కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారు? చింతకాయల విజయ్ కేసులో CIDపై హైకోర్టు సీరియస్

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కేసులో సీఐడీపైన ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది.

Chintakayala Vijay Case : కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారు? చింతకాయల విజయ్ కేసులో CIDపై హైకోర్టు సీరియస్

Updated On : October 27, 2022 / 7:04 PM IST

Chintakayala Vijay Case : టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కేసులో సీఐడీపైన ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. హైదరాబాద్ లోని విజయ్ ఇంటికి వెళ్లి పిల్లలను విచారించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీసారి హైదరాబాద్ వెళ్లి విజయ్ కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారని సీఐడీపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

41(ఎ) నోటీసులో ఉన్న అంశాలు అనుమానాస్పదంగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు 41(ఎ) లో కొన్ని అంశాలను తొలగించాలంది. అటు ఆరోపణలకు, సీఐడీ పొందుపరిచిన అంశాలకు సంబంధం లేకుండా ఉందంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చింతకాయల విజయ్ ను విచారించాల్సి వస్తే లాయర్ సమక్షంలోనే విచారించాలని కోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఈలోపు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.