Lok Sabha polls 2024: కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉంది: ప్రియాంకా గాంధీ

లోక్ సభ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతాయని ఆయా పార్టీల నేతల్లో భారీగా అంచనాలు ఉన్నాయని చెప్పారు. ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్ లో ఆమె పాల్గొని మాట్లాడారు. భావసారుప్యం గల ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.

Lok Sabha polls 2024: కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉంది: ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi

Lok Sabha polls 2024: లోక్ సభ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతాయని ఆయా పార్టీల నేతల్లో భారీగా అంచనాలు ఉన్నాయని చెప్పారు. ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్ లో ఆమె పాల్గొని మాట్లాడారు. భావసారుప్యం గల ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.

విపక్షాల ఐక్యతపై చొరవ చూపే విషయంలో ప్రతి ఒక్కరిలోనూ అంచనాలు ఉన్నాయని, తమ పార్టీపైనే అధికంగా అంచనాలు పెట్టుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు.

బీజేపీపై పోరాటం చేసే విషయంలో కార్యకర్తల్లో ధైర్యం ఉందని, దేశం కోసం దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మండల స్థాయి నుంచి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం సందర్భంగా ప్రతిపక్షాల ఐక్యతపై చర్చిస్తారని అంచనాలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలకు ఆ పార్టీ తమ నేతలకు దిశా నిర్దేశం చేసి, కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Rahul Gandhi: అదానీ విషయంలో నిజం బయటకొచ్చే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం..