బైటపడిన పాక్ కొత్త కుట్ర… నేపాల్ మీదుగా స్లీపర్ సెల్స్..
పాకిస్తాన్ ను ఎంత తిట్టిన తక్కువే. సరిహద్దుల్లో ఆ దేశం చేస్తున్న ఆటలు సాగడం లేదు. దొంగచాటుగా చొరబడి, ఆపై చావుదెబ్బ తినడం పాకిస్తాన్‌కి మామూలైపోయింది. ఈ నేపథ్యంలో, ఆ దేశపు గూఢచార సంస్థ ఐఎస్‌ఐ మరో కొత్త పన్నాగం పన్నింది. నేపాల్ వంటి ఇతర దేశాల ద్వారా తమ స్లీపర్ సెల్స్‌ను భారత్‌లోకి పంపిస్తోంది. ఈ సెల్స్ ద్వారా భారత సైనిక సమాచారంతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారం సేకరించి, భారత్‌పై కుట్రలకు పాల్పడుతోంది.