Gabbar Singh Kitchen : పవన్ కళ్యాణ్ అభిమాని పెట్టిన ‘గబ్బర్ సింగ్ కిచెన్’ హోటల్.. ఎక్కడో తెలుసా? ఈ వీడియో చూసేయండి..
పచ్చళ్ళ ప్రకాష్ అనే వ్యక్తి ఎన్నో పవన్ కళ్యాణ్ సినిమాలకు పనిచేసి స్వయంగా ఆయనకు ఫుడ్ వండి వడ్డించారు. ఆయన మీదున్న అభిమానంతో, ఆయన చేసిన సపోర్ట్ తో గబ్బర్ సింగ్ కిచెన్ అనే పేరుతో..
Gabbar Singh Kitchen : ఇటీవల కొత్త కొత్త పేర్లతో హోటల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో(Film Industry) ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో దాదాపు 40 ఏళ్లకు పైగా పనిచేసిన పచ్చళ్ళ ప్రకాష్ అనే వ్యక్తి ఎన్నో పవన్ కళ్యాణ్ సినిమాలకు పనిచేసి స్వయంగా ఆయనకు ఫుడ్ వండి వడ్డించారు. ఆయన మీదున్న అభిమానంతో, ఆయన చేసిన సపోర్ట్ తో ‘గబ్బర్ సింగ్ కిచెన్’ అనే పేరుతో హైదరాబాద్ మణికొండలో ఓయూ కాలనిలో హోటల్ ఇటీవల కొన్ని రోజుల క్రితం ప్రారంభించారు. ఇక్కడ అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ వంటలు దొరుకుతాయి. దీంతో ఈ హోటల్ ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అయితే ఈ హోటల్ వైపు ఒక లుక్ వేయాల్సిందే..