ఎవరి మాటా వినని అధికారికి ఇది పెద్ద షాకే… మంత్రి కోమటిరెడ్డి గట్టి బ్రేక్ వేశారా?

కొందరు అధికారులుంటారు, వారు ఒక్కసారి అనుకుంటే అంతే! ఎవరి మాట వినరు, తమ మాటే వింటారని పేరు తెచ్చుకుంటారు. ఎక్కడ పని చేసినా, తమ తీరుతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అలాంటి ఓ అధికారికి ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఎదురైంది!

  • Published By: Mahesh T ,Published On : October 28, 2025 / 01:04 PM IST

ఓ జిల్లాలో ఒక గొడవ వల్ల ఆయనను సెక్రటేరియట్ లో ఉన్నత పోస్టుకు మార్చారు. ‘ఇక అక్కడ ఇష్టమొచ్చినట్లు పనిచేయొచ్చు’ అని అనుకున్న ఆ అధికారికి, ఒక మంత్రి ఊహించని షాక్ ఇచ్చారట. సెక్రటేరియట్ గేటు లోపలికి వెళ్లినా, ఫిఫ్త్ ఫ్లోర్‌ అడుగు పెట్టే అవకాశం రాలేదని తెలుస్తోంది. ఆయనే ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా. కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తికి తగిన గౌరవం ఇవ్వలేదనే కారణంతో ఆయన్ను బదిలీ చేశారు. ఆయనకు రోడ్లు, భవనాల శాఖలో కొత్త పోస్ట్ ఇచ్చినా, ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి “ఆయన వద్దు” అని చెప్పారట. దాంతో పరిస్థితి మారిపోయింది.