చైనాకు 25మంది సైంటిస్టులు.. కరోనా వైరస్ గుట్టు కనిపెట్టేశారు!  

  • Publish Date - March 7, 2020 / 09:43 AM IST

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది.. డ్రాగన్ దేశం నుంచి ఇతర దేశాలకు పాకిన ఈ వైరస్ వేలాదిమందిని బలితీసుకుంది. 90వేల మందికి పైగా వ్యాధి బారినపడ్డారు. ఫిబ్రవరి ముగిసేనాటికి తీవ్రస్థాయిలో ప్రబలిన COVID-19 వైరస్ చైనాలో 51ఏళ్ల మధ్యవయస్సు ఉన్న వారిపైనే అధిక ప్రభావం చూపింది. చైనాలో మెజార్టీగా పరిశీలిస్తే 30ఏళ్ల మధ్య వయస్సు నుంచి 69ఏళ్ల వయస్సు ఉన్నవారికే ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు.(కరోనా అప్‌డేట్: లక్ష దాటిన బాధితులు.. ఇండియాలో 31)

చైనాలో ప్రబలిన కరోనా వైరస్ మూలం ఏంటో తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి 25మంది సైంటిస్టులు చైనాకు వెళ్లారు. అక్కడ కరోనా వైరస్ వ్యాప్తిపై పరిశోధన చేశారు. వారి పరిశోధనలో కరోనా వైరస్ వ్యాప్తికి గల కారణాలు.. అది మనుషుల్లోకి ఎలా సోకింది.. దాని తీవ్రత ఎలా ఉంటుంది అనేదానిపై సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. కరోనా వైరస్ గురించి 25 మంది సైంటిస్టులు వెల్లడించిన ముఖ్యమైన అంశాలు ఏంటో ఓసారి చూద్దాం..

గబ్బిలాలు :
కరోనా వైరస్ వ్యాప్తికి మూలం గబ్బిలాలని తొలుత భావించారు. కానీ, దీనిపై సైంటిస్టులు స్ఫష్టత లేదన్నారు. ఏ జంతువు నుంచి మనుషుల్లోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందో కచ్చితమైన ఆధారాలు లభించలేదు. 

ఎలా వ్యాపిస్తోంది :
COVID-19 అనే ఈ మమహ్మారి.. అసురక్షితమైన చర్య ద్వారా సోకినట్టు రిపోర్టులో తేలింది. అది ఒక రకంగా గాలిద్వారా వ్యాపించినట్టు గుర్తించారు. గాలిలోని నీటి తుంపరలే ప్రధాన కారణమని నమ్మడానికి లేదు. 

ఒకరి నుంచి మరొకరికి వ్యాపించిందా? :
చైనాలో ఒకరికి కరోనా వైరస్ వ్యాపించి వారి నుంచి కుటుబంలో మరొకరికి వ్యాపించిందా? అనేదానిపై కూడా సైంటిస్టులు పరిశోధన జరిపారు. పెద్ద కుటుంబాల్లో ఒకరికి సోకిన ఈ వైరస్ అలా కుటుంబంలోని మరొకరికి వ్యాపించి ఉండొచ్చునని అంచనా. అయితే ఇలా సోకిన వారిలో 78శాతం నుంచి 85 శాతం కుటుంబాలు వైరస్ బాధితులుగా ఉన్నారు. 

వ్యాధినిరోధక శక్తి లేకపోవడం :
కరోనావైరస్.. కొత్తగా గుర్తించిన ఒక వ్యాధికారకము.. మానవులలో ముందుగా ఉన్న రోగనిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందో తెలియదు’ అని నివేదిక తెలిపింది. ప్రతి ఒక్కరూ సంక్రమించే అవకాశం ఉంది. అయినప్పటికీ సంక్రమణకు అవకాశం పెరిగే ప్రమాద కారకాలు ఉండవచ్చునని తెలిపింది.

పిల్లల్లో కరోనావైరస్
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిపై కరోనా ప్రభావం రేటు తక్కువగా ఉంది అని నివేదిక తెలిపింది. నవంబర్, డిసెంబర్, లేదా జనవరి మొదటి రెండు వారాల్లో వుహాన్‌లో పిల్లలలో పాజిటీవ్ కరోనావైరస్ కేసులను గుర్తించలేదు.  ఒక పిల్లవాడి నుంచి వైరస్ పెద్దవారికి వ్యాపించిన సందర్భాలను కూడా పరిశోధకులు ప్రస్తావించారు. అని నివేదిక పేర్కొంది.

లక్షణాల రకాలు
COVID-19 లక్షణాలు తీవ్రమైన న్యుమోనియాకు దారి తీసి అక్కడ నుంచి మరణానికి దారితీస్తాయి. తేలికపాటి శ్వాసకోశ సమస్యలు, జ్వరం ఉంటాయి. సగటున, సంక్రమణ తర్వాత ఐదు నుండి ఆరు రోజుల వరకు దాని ప్రభావం బయటకు కనిపిస్తుందని నివేదిక తెలిపింది. అధ్యయనం చేసిన 55,000 కేసులలో ఇదే లక్షణాలు బయటపడ్డాయి. 

జ్వరం (87.9%)
పొడి దగ్గు (67.7%)
అలసట (38.1%)
శ్వాసకోశ వ్యవస్థ, కఫం, లాలాజలం, శ్లేష్మం ఉత్పత్తి (33.4%)
ఊపిరి తీసుకోలేకపోవడం (18.6%)
గొంతు నొప్పి (13.9%)
తలనొప్పి (13.6%)
చలి (11.4%)

వైరస్ తీవ్రత :
కరోనా బాధితుల్లో 80% మందికి COVID-19 తేలికపాటి, స్వల్ప ప్రభావం ఉన్న కేసులు ఉన్నాయి. 13.8% మందికి తీవ్రమైన కేసులు ఉన్నాయి. 6.1% మంది క్లిష్టమైనవి, శ్వాసకోశ వైఫల్యం, మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయ్యిలర్ అయిన బాధితులు ఎక్కువగా ఉన్నారు. అత్యధిక ప్రమాదం ఉన్న వ్యక్తుల్లో ముందుగా ఉన్న పరిస్థితులు, వయస్సు COVID-19 తీవ్రతను ప్రభావితం చేస్తాయని గుర్తించారు.

60 ఏళ్లు పైబడిన వారిలో రక్తపోటు, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, క్యాన్సర్ వంటి అంతర్లీన పరిస్థితులతో ఉన్నవారిలో COVID-19 నుండి తీవ్రంగా లేదా ప్రాణాంతక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. పిల్లలలో, అనారోగ్యం “చాలా అరుదుగా, తేలికపాటిదిగా కనిపిస్తుంది. పిల్లలలో 2.5% కేసులు మాత్రమే తీవ్రంగా ఉన్నాయి, 0.2% క్లిష్టమైనవిగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. 

See Also | సీనియర్‌కి జూనియర్ ఛాలెంజ్..