Diabetes Care : మధుమేహానికి 6 అద్భుతమైన హోం రెమెడీస్.. ఏ ఒక్కటి చేసినా డయాబెటిస్ దెబ్బకు నార్మల్‌కు వచ్చేస్తుంది..!

Diabetes Care : డయాబెటిస్ నుంచి తొందరగా బయటపడాలంటే 6 అద్భుతమైన హోం రెమెడీలు ఉన్నాయి. క్రమం తప్పకుండా మీరు కొన్ని నెలల పాటు పాటిస్తే కొద్ది రోజుల్లోనే ఈ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చు.

diabetes home remedies

Diabetes Care : ప్రస్తుత ఆధునిక జీవితంలో డయాబెటిస్ పెద్ద సమస్యగా మారుతోంది. జీవనశైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. భారత్‌‌లో ప్రతి 11 మంది యువతలో ఒకరు ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 90 మిలియన్ల నుంచి 113 మిలియన్లకు, 2045 నాటికి 151 మిలియన్లకు పెరగవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సకాలంలో నియంత్రించకపోతే అది ప్రాణాంతకం కూడా కావచ్చు.

Read Also : Diabetic Risk : మీకు ప్రీ-డయాబెటిస్ ఉందా? ఈ విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి.. బోర్డర్ లైన్ దాటితే అంతే సంగతులు..!

డయాబెటిస్ మీకు పెద్దగా హాని కలిగించకూడదని భావిస్తే.. మీరు కొన్ని హోం రెమిడీలను ప్రయత్నింవచ్చు. మధుమేహం నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయి. అయితే, మీకు కూడా డయాబెటిస్ ఉందా? మందులు వాడి విసిగిపోయారా?

అయితే, మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఈ 6 అద్భుతమైన హోం రెమెడీలను ఓసారి ట్రై చేయండి. ఇందులో మీరు ఏ ఒక్కటి క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు చేసినా డయాబెటిస్ దెబ్బకు నార్మల్ వచ్చేస్తుంది.

వేప :
వేప ఆకులు మధుమేహానికి దివ్యౌషధం. చేదుగా ఉన్నప్పటికీ ఇందులో అద్భుతమైన ఔషద గుణాలు ఉన్నాయి. ఫ్లేవనాయిడ్లు, ట్రైటెర్పెనాయిడ్లు, యాంటీవైరల్ పదార్థాలు, గ్లైకోసైడ్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి. మీరు వేప పొడిని కూడా ఉపయోగించవచ్చు. కొన్ని ఎండిన వేప ఆకులను బ్లెండర్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. ఆ తరువాత ఈ పొడిని రోజుకు రెండుసార్లు ఉపయోగించండి.

కాకరకాయ రసం :
ప్రతిరోజు ఉదయం కాకరకాయ రసం తాగితే లేదా కాకరకాయ కూరగాయలు తింటే మధుమేహాన్ని నివారించవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఎప్పుడూ ఉంచుతుంది.

బెర్రీలు, నేరేడు విత్తనాల పొడి :
వేసవి కాలం వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో బెర్రీలు కూడా లభిస్తాయి. బ్లాక్‌బెర్రీస్‌ను బ్లాక్ సాల్ట్‌తో కలిపి తింటే డయాబెటిస్ తగ్గుతుంది. నేరేడు పండ్ల విత్తనాలను ఎండబెట్టి, వాటిని రుబ్బి, దాని పొడిని ఉపయోగించడం వల్ల కూడా మధుమేహంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ పొడిని రెండు చెంచాల గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల డయాబెటిస్‌లో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

అల్లం :
మీరు ప్రతిరోజూ అల్లం తీసుకుంటే.. అది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. అల్లం ఇన్సులిన్‌ను సరిగా ఉత్పత్తి చేసేలా చేస్తుంది. ఒక గిన్నెలో ఒక కప్పు నీరు, ఒక అంగుళం అల్లం వేసి 5 నిమిషాలు మరిగించాలి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు దీన్ని తాగడం వల్ల డయాబెటిస్ నుంచి తొందరగా బయటపడవచ్చు.

మెంతి పొడి :
మెంతులు మధుమేహంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. గ్లూకోజ్ మొత్తాన్ని అదుపులోకి తెస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచేలా పనిచేస్తాయి. ప్రతిరోజూ రెండు టీస్పూన్ల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ నీటిని తాగి విత్తనాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినండి. షుగర్ అదుపులోకి రావడం మీరే చూస్తారు.

Read Also : Risk Of Diabetes In Youngsters : యువతలో మధుమేహం ముప్పును పెంచే ప్రధాన కారణాలివే.. మీ ఆరోగ్యం మీ చేతుల్లో..!

వ్యాయామం :
చక్కెర స్థాయిలను నియంత్రించడంలో వ్యాయామం అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నడక, జాగింగ్, ఈత, టెన్నిస్ లేదా బ్యాడ్మింటన్ ఆడటమే కాకుండా, ఏరోబిక్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటివి మధుమేహం నుంచి తొందరగా బయపడేందుకు సాయపడతాయి.

Disclaimer : వాస్తవానికి వైద్యపరంగా ఈ హోం రెమెడీలకు ఎలాంటి ధృవీకరణ లేదు. కేవలం ఇది మీకు సమాచారం కోసం మాత్రమే.. మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగా మీ వైద్యున్ని సంప్రదించి సలహా మేరకు ఈ రెమెడీలను ప్రయత్నించండి.