Diabetic Risk : మీకు ప్రీ-డయాబెటిస్ ఉందా? ఈ విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి.. బోర్డర్ లైన్ దాటితే అంతే సంగతులు..!

Diabetic Risk : మీకు ప్రీ-డయాబెటిస్ ఉందని తెలిసిందా? రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రీ-డయాబెటిస్ వస్తుంది. మీ ఆహారంలో మార్పులు, అలవాట్లను మార్చుకుంటే అది డయాబెటిస్‌గా మారకుండా కంట్రోల్ చేయొచ్చు.

Diabetic Risk : మీకు ప్రీ-డయాబెటిస్ ఉందా? ఈ విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి.. బోర్డర్ లైన్ దాటితే అంతే సంగతులు..!

Diabetic Risk

Updated On : February 12, 2025 / 4:36 PM IST

Diabetic Risk : మీకు ప్రీ-డయాబెటిస్ ఉందని తేలిందా? అయితే, జర జాగ్రత్త.. ఇప్పటినుంచే కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే మిమ్మల్ని డయాబెటిస్ కు దగ్గర చేస్తాయని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరిలో ఈ డయాబెటిస్ మహమ్మారి విస్తరిస్తోంది. ఒకరి జీవితంలోకి డయాబెటిస్ ఎంటర్ అయితే అంతే సంగతులు.. ఇక జీవితాంతం షుగర్ కంట్రోల్ చేయడంపైనే దృష్టిపెట్టాలి.

Read Also : World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!

లేదంటే.. మరిన్ని కాంప్లికేషన్స్ వచ్చి చివరికి ఆర్గాన్స్ దెబ్బతినే పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ డయాబెటిస్ పరిస్థితికి ముందుగా ఉండే దాన్నే ప్రీ-డయాబెటిస్ స్టేజ్ అని అంటారు. ఈ దశలో మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ప్రీ-డయాబెటిస్‌గా నిర్ధారించవచ్చు.

అయితే, మీ ఆహారం, అలవాట్లను మార్చుకోవడం ద్వారా అది డయాబెటిస్‌గా మారకుండా నిరోధించవచ్చు. డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే ఏయే విషయాలను గుర్తుంచుకోవాలో నిపుణులు సలహాలు, సూచనలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ప్రీ-డయాబెటిస్ కేర్.. డయాబెటిస్ అనేది జీవక్రియ సంబంధిత వ్యాధి. అంటే.. లైఫ్ స్టయిల్ డిజీస్ అనమాట.. దీనిని మందులు, ఆహారంతో మాత్రమే నియంత్రించవచ్చు. కానీ, డయాబెటిస్ వచ్చే ముందు.. ఒక వ్యక్తి డయాబెటిస్‌కు ముందు దశలో ఉంటాడు. దీన్నే ప్రీ-డయాబెటిస్ అంటారు. రక్తంలో చక్కెర స్థాయి 100mg/dL నుంచి 125 mg/dL మధ్య ఉంటే.. ఆ వ్యక్తి ప్రీ-డయాబెటిక్ అని అర్థం. ఇలాంటి పరిస్థితిలో, మీ జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యమని గమనించాలి.

వైద్య నిపుణుల ప్రకారం.. ప్రీ-డయాబెటిస్ గుర్తించిన వెంటనే మీరు కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలి. అప్పుడే డయాబెటిస్ రిస్క్ ముందుగానే నియంత్రించవచ్చు. చాలా సార్లు ఈ వైద్య పరిస్థితి గురించి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. దీని కారణంగా వారికి మధుమేహం వస్తుందని నిపుణులు అంటున్నారు. కానీ, మీ ఆహారం, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా చాలా సులభంగా నియంత్రించవచ్చు.

ఆహారంలో ఏ విషయాలు చేర్చాలి :
వైద్య నిపుణుల ప్రకారం.. మీరు ప్రీ-డయాబెటిస్ ఉందని తెలిసిన తర్వాత మీ ఆహారాన్ని మార్చుకోవాలి. మరిన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు తినండి. మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సాయపడతాయి. నిపుణులు మీ ఆహారంలో ప్రాసెస్ చేసిన చక్కెర, కార్బోహైడ్రేట్లను తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Garlic Health Benefits : పచ్చి వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే అసలు వదిలిపెట్టరు.. ప్రతిరోజూ ఇలా తిన్నారంటే అద్భుతంగా పనిచేస్తుంది!

రోజూ వ్యాయామం చేయండి :
మీరు క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి వ్యాయామం చేయడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సాయపడుతుంది. అధిక బరువు పెరగడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మీ బరువును ఎప్పుడూ అదుపులో ఉంచుకోండి.

ఒత్తిడిని తగ్గించుకోండి :
ఇది కాకుండా, మీ ఒత్తిడిని తగ్గించుకోండి. రోజూ యోగా, ధ్యానం చేయండి. మీ శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది.

రోజూ రక్తంలో చక్కెరను చెక్ చేయండి :
మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి. మీరు డయాబెటిస్ రిస్క్ తగ్గించవచ్చు. మీరు వైద్యున్ని క్రమం తప్పకుండా సంప్రదించి ఆయన ఇచ్చిన సలహాలను పాటించడం కూడా ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు.