Risk Of Diabetes In Youngsters : యువతలో మధుమేహం ముప్పును పెంచే ప్రధాన కారణాలివే.. మీ ఆరోగ్యం మీ చేతుల్లో..!

Risk Of Diabetes In Youngsters : యువతలో మధుమేహం ముప్పు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎక్కువగా కారణమవుతాయి.

Risk Of Diabetes In Youngsters : యువతలో మధుమేహం ముప్పును పెంచే ప్రధాన కారణాలివే.. మీ ఆరోగ్యం మీ చేతుల్లో..!

Here we discuss how certain factors can increase risk of diabetes in youngsters.

Risk Of Diabetes In Youngsters : మధుమేహం అనేది ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరిలో డయాబెటిస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. డయాబెటిస్ అని ఎలా గుర్తించాలంటే.. రక్తంలోని చక్కెర, గ్లూకోజ్‌ స్థాయిలో అధిక స్థాయిలో పెరగడమే.. ఇది జీవితంలో ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలికంగా వేధిస్తుంటుంది. మధుమేహంలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. అందులో టైప్ 1 డయాబెటిస్, రెండోది టైప్ 2 డయాబెటిస్.. ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం వచ్చే ప్రమాదం యువకులలో భారీగా పెరుగుతోంది.

Read Also : Vitamin D Levels : శీతాకాలంలో మీ విటమిన్ డి స్థాయిలను పెంచడానికి అద్భుతమైన డైట్ ఇదిగో..!

ప్రధానంగా చిన్నతనంలోనే ఊబకాయం రేట్లు, అదేచోట గంటల కొద్ది కూర్చొని పనిచేయడం వంటి జీవనశైలి కారణాలుగా చెప్పవచ్చు. అంతేకాదు.. పేలవమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మధుమేహం కుటుంబ చరిత్ర కలిగి ఉండటం అనేది యువతలో మధుమేహం ప్రాబల్యం పెరగడానికి కారణమవుతుంది. కొన్ని కారణాలు యువతలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని ఎలా పెంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

యువకులలో మధుమేహం ముప్పునకు 8 కారణాలివే :
1. జీవనశైలి :
శారీరక శ్రమ లేకపోవడం, అధిక స్క్రీన్ సమయం కూడా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ కారకాన్ని గుర్తించడం అనేది యువకుడి దినచర్య, శారీరక శ్రమ స్థాయిని అంచనా వేయడం ద్వారా చేయవచ్చు. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని కలిగి ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఒకేచోట కదలకుండా ఉండకూడదు. ఎక్కువ సమయం నడక కూడా షుగర్ లెవల్స్ అదుపులో ఉండేందుకు సాయపడుతుంది.

2. ఆహారపు చెడు అలవాట్లు :
అధిక క్యాలరీలు, ప్రాసెస్ చేసిన చక్కెర ఆహారాలు తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కారకాన్ని గుర్తించడం అనేది యువకుల ఆహారపు అలవాట్లు, ఆహార ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలతో కూడిన పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. అదే సమయంలో ప్రాసెస్ చేసిన చక్కెర ఆహారాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి.

3. ఊబకాయం :
అధిక శరీర బరువు మధుమేహానికి ప్రధాన ప్రమాద కారకంగా చెప్పవచ్చు. ఈ కారకాన్ని గుర్తించడంతో పాటు బరువును పర్యవేక్షించడం చేయాలి. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఎంత స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. సమతుల్య ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బరువు ఉండేలా దృష్టి పెట్టాలి.

4. జన్యుపరమైన సమస్యలు :
మధుమేహం అనేది కుటుంబ చరిత్రను కలిగి ఉండటం యువకుల్లో ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ కారకాన్ని ముందుగానే గుర్తించాలి. ఏదైనా సందర్భాలలో కుటుంబ వైద్య చరిత్రను కూడా పరిశోధించాలి. జన్యుపరమైన కారకాలను మార్చలేనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఇప్పటికీ మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.

5. తగినంత నిద్ర లేకపోవడం :
తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కారకాన్ని గుర్తించడం అనేది యువకుల నిద్ర విధానాలు, నిత్యకృత్యాలను అంచనా వేయాల్సి ఉంటుంది.మంచి నిద్ర పరిశుభ్రత పద్ధతులను పాటించాలి. మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడానికి నిద్రకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి.

Here we discuss how certain factors can increase risk of diabetes in youngsters.

 Increasing Risk Of Diabetes In Youngsters

6. ఒత్తిడి :
దీర్ఘకాలిక ఒత్తిడి యువతలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మానసిక కల్లోలం లేదా ప్రవర్తనా మార్పులు వంటి ఒత్తిడి సంకేతాలను గుర్తించడం ద్వారా తెలుసుకోవచ్చు. సమతుల్య జీవనశైలిని కలిగి ఉండటంతో పాటు ఒత్తిడి నివారణ చర్యలు చేపట్టాలి.

7. ఫ్యామిలీ హిస్టరీ :
గర్భధారణ సమయంలో తల్లికి మధుమేహం లేదా ఊబకాయం వంటి కొన్ని ప్రినేటల్ కారకాలు కూడా యువకులలో మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ కారకాన్ని గుర్తించడానికి ప్రినేటల్ మెడికల్ హిస్టరీని సమీక్షించాలి. దీనికి సంబంధించి వైద్యులను సంప్రదించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం వల్ల యువతలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

8. అధిక రక్తపోటు :
హైపర్ టెన్షన్ అని పిలిచే అధిక రక్తపోటు కలిగి కారణంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కారకాన్ని గుర్తించడం అనేది సాధారణ రక్తపోటు మాదిరిగానే తెలుసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మధుమేహాన్ని నివారించడంలో సాయపడుతుంది.

యువకులలో మధుమేహం ప్రారంభంలోనే గుర్తించి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అంతేకాదు.. యువతలో డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అనేది ఎంతైన అవసరం.

Read Also : Healthy Lifestyle in Winter : వింటర్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ బ్రేక్ చేయాల్సిందే !