ఆయుర్వేదంతో కరోనాకు చెక్.. 5 రోజుల్లోనే పూర్తిగా కోలుకోంటున్నారంట!

  • Published By: sreehari ,Published On : September 29, 2020 / 04:39 PM IST
ఆయుర్వేదంతో కరోనాకు చెక్.. 5 రోజుల్లోనే పూర్తిగా కోలుకోంటున్నారంట!

Updated On : September 29, 2020 / 4:52 PM IST

Ayurvedic medicines remedy for COVID-19 : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి ఆయుర్వేదంతో చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఆయుర్వేద విధానంతో కరోనా నుంచి 10 రోజుల్లోనే కోలుకోవచ్చునని చెబుతున్నారు. దీనికి సంబంధించి నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలతో ఆయుర్వేదంతో కరోనా నుంచి కోలుకోవచ్చునని రుజువైంది. ఒకవైపు కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కానీ, ఆయుర్వేద ఔషధ విధానంలో అద్భుతమైన ఫలితాలు రావడంతో మరిన్ని ఆశలు రేకిత్తిస్తోంది.



శాస్త్రీయ విధానంలోని మందుల కంటే ఆయుర్వేద ఔషధాలే ఉత్తమ ఫలితాలను ఇస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఆయుర్వేద పద్ధతిలో రోగులు కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకుంటున్నారంట.శాస్త్రీయ పద్ధతిలో 60 శాతంగా ఉండగా.. ఆయుర్వేద పద్ధతిలో కేవలం 5 రోజుల్లోనే 86.66 శాతం మంది కోలుకున్నారని ఓ నివేదిక వెల్లడించింది. సంప్రదాయ విధానంలో కంటే ఆయుర్వేద విధానంలో 10 రోజుల్లో రోగులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండానే పూర్తిగా కోలుకుంటున్నారు.

కరోనాపై ఆయుర్వేద చికిత్సకు సంబంధించి మూడు ఆస్పత్రుల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలు వెల్లడయ్యాయి. ఆయుర్వేదిక్ రెమిడీగా పేరొందిన Immunofree, Reginmune కాంబినేషన్ ట్రీట్ మెంట్‌తో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ ట్రయల్స్ ను Corival Life Sciences, Biogetica సంయుక్తంగా నిర్వహించాయి.



కరోనా బాధితులకు ఈ ఆయుర్వేద ఔషధాన్ని ఇచ్చి పరీక్షించగా అనుకూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాయి. ఏపీలోని శ్రీకాకుళం ప్రభుత్వ వైద్యాసుపత్రి, గుజరాత్ లోని వడోదరాలో Parul Sevashram Hospital, మహారాష్ట్రలోని పుణెలో Lokmanya Hospital ఈ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతించింది.



ఈ రెండు ఆయుర్వేద ఔషధాలు కొవిడ్‌ చికిత్సలో ప్రభావవంతంగా పనిచేసినట్టు ఫలితాల్లో రుజువైంది. ఈ చికిత్స తీసుకున్న పది రోజుల తర్వాత చాలామంది కోవిడ్ బాధితుల్లో నెగిటివ్‌గా తేలింది. సంప్రదాయ విధానంతో పోలిస్తే.. నేచురల్ ట్రీట్ మెంట్ విధానం C రిక్రియేటివ్‌ ప్రోటీన్‌, D డైమర్‌, RT PCR తదితర పరీక్షల్లో కూడా 20 నుంచి 60 శాతం మెరుగైన ఫలితాలను సాధించింది. శాస్త్రీయ విధానంతో పోలిస్తే.. ఆయుర్వేద చికిత్స విధానంలో ఎలాంటి సమస్యలేవి లేవని తేలింది. కేరళ, గోవా రాష్ట్రాల్లోనూ పలు ఆయుర్వేద చికిత్సలు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు నివేదికల్లో వెల్లడైంది. చైనాలోనూ ‘TCM’ అనే చికిత్సా విధానం మంచి ఫలితాలనిచ్చింది.