అంత వెటకారం వద్దు, గుండెకి మంచిదికాదు

  • Published By: murthy ,Published On : September 19, 2020 / 12:06 PM IST
అంత వెటకారం వద్దు, గుండెకి మంచిదికాదు

Updated On : September 19, 2020 / 12:52 PM IST

sarcastic puts you at a heart attack: నాకు వెటకారం ఎక్కువ. పక్కవాళ్లను ఆటిపట్టించడం నాకు సరదా..ఇలా చాలాగొప్పలు చెప్పుకొంటారు. కాకపోతే మరీ వెటకారం ఎక్కువైతే ఒంటికి మంచిదికాదని అంటున్నారు సైంటిస్ట్‌లు.

వెటకారంగా మాట్లాడేవాళ్లు, ఇరిటేట్ చేసేవాళ్లు తొందరగా చనిపోయే అవకాశాలెక్కువంట. రీసెర్చ్ చెబుతోంది.
ఎప్పుడూ ఏడుపుగొట్టు ముఖమేసుకొని, పక్కవాళ్లమీద ఆడిపోసుకొనే వాళ్లకు దీర్ఘకాలంలో heart attack వస్తాయంట.

ప్రతిదానికీ నెగిటీవ్‌గా మాట్లాడేవాళ్లు, బిహేవ్ చేసేవాళ్లు ఎక్కువ స్మోక్ చేస్తారు. హెల్త్ గురించి పట్టించుకోరు. దానికితోడు లావెక్కుతారని సైంటిస్ట్‌లు అంటున్నారు.


హార్ట్ ఎటాక్ పేషెంట్లు 2,300 మందిని అమెరికా వైద్య నిపుణులు రెండేళ్లపాటు బాగా ఫాలో అయ్యారు. University of Tennessee చెప్పినదాని ప్రకారం, వెటకారం, నిరాశగా మాట్లాడటం, పక్కవాళ్లకి చెడుగా చెప్పడం, చిన్నవిషయాలకే లోపల లోపల కోపంతో ఊగిపోవడం వంటి లక్షణాలు వీళ్లలో ఎక్కువగా ఉన్నాయంట. ఇదేమీ ఒక్కసారి కనిపించేదికాదు. తోటివారితో వాళ్ల ప్రవర్తన తీరే అంత. ఇది వాళ్ల తత్త్వమని అంటున్నారు. దీన్నే hostile attitude అంటున్నారు.

lifestyle habitsని కంట్రోల్ చేయడం వల్ల హార్ట్ ఎటాక్ పేషెంట్ల పరిస్థితి మెరుగుపడుతుంది. నెమ్మదిగా వాళ్ల ప్రవర్తనకూడా పాజిటీవ్‌గా మారుతుందంట.