Diabetes: మెడిసిన్ వాడకుండా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చా.. నిపుణులు ఎం చెప్తున్నారు?

షుగర్ ను మెడిసిన్ లేకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ, అది కేవలం టైపు 2 డయాబెటీస్, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని తెలిసిన వారిలో మాత్రమే.

Can diabetes be controlled without using medicine?

షుగర్.. రోజురోజుకి ఈ సమస్యతో బాధపడుతున్న వారి ఘననీయంగా పెరుగుతోంది. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఈ వ్యాధి రావడానికి కారణం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో జన్యు పరమైన కారణాల వల్ల, వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మరీ ముఖ్యంగా యువతలో ఈ వ్యాధి సంక్రమన ఎక్కువగా కనిపిస్తోంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, సమయపాలన లేని ఆహారపు అలవాట్లు కారణంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

ఒకసారి ఈ సమస్య వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. దీనికి క్యూరింగ్ అనేది లేదు. మెడిసిన్ తో కంట్రోల్ చేసుకోవడమే. అయితే షుగర్ సమస్యతో బాధపడుతున్న చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే? షుగర్ వ్యాధిని మెడిసిన్ వాడకుండా కంట్రోల్ చేయలేమా? ఖచ్చితంగా ట్యాబ్లేట్స్ వాడవాల్సిందేనా? ఫుడ్ కంట్రోల్ చేస్తూ రోగాన్ని నయం చేయలేమా? అని. మరి ఈ సందేహానికి నిపుణులు చెప్తున్నా మాట ఏంటంటే? షుగర్ ను మెడిసిన్ లేకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ, అది కేవలం టైపు 2 డయాబెటీస్, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని తెలిసిన వారిలో మాత్రమే. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారిలో మాత్రం అసాధ్యం.

మరి షుగర్ కంట్రోల్ కోసం పాటించాల్సిన పద్ధతులు:

ఫుడ్ డైట్: ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి. వైట్ రైస్ కి దూరంగా ఉండాలి. గ్లైసెమిక్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మొలకలు, డ్రై ఫ్రూప్ట్స్, తాజా కూరగాయలు, చక్కర స్థాయిలు తక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి.

వ్యాయాయం: క్రమం తప్పకుండా వ్యాయాయం చేయాలి. ఉదయం, సాయంత్రం కనీసం 30 నిమిషాల పాటు నడవడం మంచిది. చిన్న చిన్న ఎక్సర్ సైజ్ లు చేయడం అలవాటు చేసుకోవాలి. శారీరక శ్రమ షుగర్ కంట్రోలింగ్ లో చాలా అవసరం.

బరువు కంట్రోల్: షుగర్ పేషంట్స్ తప్పకుండ తమ బరువును కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ కి ప్రధాన కారణం ఊబకాయం. కాబట్టి బరువు విషయంలో ఖచ్చితంగా ఉండాలి.

ఒత్తిడికి దూరం: షుగర్ పేషంట్స్ ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో పెరుగుతున్న షుగర్ సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి. పని, అర్థకపరమైన, ఫ్యామిలీ ఇలా చాలా రకాల సమస్యల వల్ల మనిషి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. ఒత్తిడి తగ్గించుకోవడం కోసం యోగ. మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి అలవాటు చేసుకోవాలి.

రెగ్యులర్ చెకప్: షుగర్ లెవల్స్ ని రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. మెడిసిన్ లేకుండా కంట్రోల్ చేస్తున్నప్పటికి కొన్నిసార్లు షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ చెకప్ అనేది చాల అవసరం. ఒకవేళ షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.