గట్టిగా అరవకుండా, నెమ్మదిగా మాట్లాడితే, కరోనా వ్యాప్తిని చాలావరకు తగ్గించొచ్చు!

  • Publish Date - September 11, 2020 / 10:02 PM IST

spread of the coronavirus: ప్రపంచమంతా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గాలి ద్వారా లేదా ఎవరైనా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా ఒకరినొకరు ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు.. ఇలా మాట్లాడిన సమయంలో వారి నోటిలోని తుంపర్లతో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. అందుకే మాట్లాడే సమయంలో గట్టిగా మాట్లాడొద్దంటోంది ఓ కొత్త అధ్యయనం.. గట్టిగా అరవకుండా నెమ్మదిగా మాట్లాడితే కరోనా వ్యాప్తి చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపింది.



అందులోనూ వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని, లోపలి గాలి, బయట గాలితో ఎప్పటికప్పుడూ ప్రెష్ అయ్యేలా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి ప్రభావాన్ని సైంటిస్టులు తెలిపారు. నిశ్శబ్దంగా మాట్లాడటం వల్ల ప్రాణాంతకమైన కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గిపోతుందని అధ్యయనం కనుగొంది. ఆస్పత్రి లేదా వెయిటింగ్ రూములు లేదా భోజన సదుపాయాలు వంటి అధిక-ప్రమాదకరమైన ఇండోర్‌లో కరోనా వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.



జూలై నెలలో సాంగ్ రెహార్షల్ సమయంలో లేదా రెస్టారెంట్లు లేదా ఫిట్‌నెస్ క్లాసుల్లో ఉన్నప్పుడు ఏరోసోల్ ప్రసారం చేసే అవకాశాన్ని గుర్తించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల్లో పేర్కొంది. ఎవరైనా మాట్లాడేటప్పుడు బయటకు వచ్చిన సూక్ష్మ నోటితుంపర్లు త్వరగా ఆవిరైపోయి వైరస్ పెద్ద ఏరోసోల్ కణాలను వదిలివేస్తాయి. బిగ్గరగా మాట్లాడేప్పుడు విడుదలయ్యే 35 డెసిబెల్స్ లేదా గుసగుసలాడుకోవడం విడుదలయ్యే డెసిబెల్స్ మధ్య వ్యత్యాసాన్ని పరీక్షించారు.



ఈ రేటును యాభై సార్లు పెంచుతుందని అధ్యయన పరిశోధకులు గుర్తించారు. సాధారణ మాటల్లో 10-డెసిబెల్ పరిధికి పైన ఉంటుంది.. రెస్టారెంట్లలో మాట్లాడే శబ్దం 70 డెసిబెల్ ఉంటుంది. ఏరోసోల్ ట్రాన్స్మిషన్ రిస్క్ పరంగా ఆలోచిస్తే.. అన్ని ఇండోర్ వాతావరణాలు వైరస్ వాహకాలు కావని పరిశోధకులు విలియం రిస్టెన్‌పార్ట్ చెప్పారు. రద్దీ లేని నిశ్శబ్ద తరగతి గది చాలా తక్కువ ప్రమాదకరమైనదిగా గుర్తించారు.

ఏరోసోల్స్ లేని ఆపరేటింగ్ థియేటర్‌లో వేర్వేరు పిచ్‌లు వాల్యూమ్‌లలో ‘హ్యాపీ బర్త్‌డే’ పాడారు.. నిర్దిష్ట శబ్దాల ద్వారా ఉత్పత్తి అయిన ఏరోసోల్‌లను విశ్లేషించడానికి పరిశోధించారు. వాయిస్ పరిమాణం ఏరోసోల్ పరిమాణంపై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుందని కనుగొన్నారు.



ఇలాంటి స్థాయిలో మాట్లాడటం పాడటం మధ్య కొంత తేడా ఉందని గుర్తించారు. పెద్ద ఎత్తున పాడటం లేదా అరవడం 30 రెట్లు ఎక్కువ ఏరోసోల్‌ను ఉత్పత్తి చేస్తుందని కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 27.9 మిలియన్లకు చేరుకోవడంతో మరణించిన వారి సంఖ్య 905,000కు దాటింది.