ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చైనాలో నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటివరకూ ఇరాన్‌లో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ఒకేరోజులో 106మందికి పైగా కరోనా సోకగా… అందులో ఇరాన్ ఉప రాష్ట్రపతి, మసౌమెహ్ ఎబ్తెకర్ కూడా వైరస్ సోకినట్టు ఉన్నత అధికారి ఒకరు వెల్లడించారు.
ఇరాన్‌లో కరోనా వేగంగా వ్యాపిచెందుతోందని ఇప్పటివరకూ 245కు కరోనా కేసుల సంఖ్య పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియనౌస్ జాహాన్‌పౌర్ తెలిపారు. ఇరాన్‌లో ఫిబ్రవరి 19న తొలి కరోనా కేసు నమోదు కాగా.. అప్పటి నుంచి ఒకే రోజులో అత్యధికంగా 106 కరోనా కేసులను ధ్రువీకరించినట్టు జాహాన్‌పౌర్ వెల్లడించారు.
చైనా బయటి దేశాల్లో అత్యధికంగా కరోనా (COVID-19) మరణాలు ఇస్లామిక్ రిపబ్లికన్ లోనే నమోదయ్యాయి. కరోనా సోకిన బాధితుల్లో ఇరాన్ ఉపరాష్ట్రపతుల్లో ఒకరైనా (మహిళా విదేశీ వ్యవహారాల శాఖ) మసౌమె ఎబ్తెకర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా ఆ దేశ అధికారులు తెలిపారు. 1979లో టెహ్రాన్ లోని అమెరికా రాయబారి కార్యాలయంలో విద్యార్థులకు మాజీ ప్రతినిధిగా ఉన్న ఎబ్తెకర్ కు ఆమె నివాసంలో పరీక్షలు నిర్వహించారు
తన బృందంలోని మిగతావారికి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించినట్టు IRNA న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పార్లమెంట్ జాతీయ భద్రతా, విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు మోజ్తాబా జోల్నర్ కు వైరస్ సోకింది. దీంతో వైస్ ప్రెసిడెంట్ సహా ఎబ్తెకర్ లు తమకు తామే నిర్బంధించుకున్నట్టు తెలిపింది. సెంట్రల్ ఇరాన్ లోని పవిత్ర నగరమైన షితేలో తొలి కరోనా కేసు నమోదైంది.
Also Read | వైరస్ రూటు మార్చింది.. కుక్కకు సోకిన కరోనా!