2021 తొలి త్రైమాసికంలో ఒకటి కంటే ఎక్కువ కోవిడ్ వ్యాక్సిన్లు!

  • Publish Date - October 18, 2020 / 07:42 PM IST

More than one Covid-19 vaccine : ప్రపంచాన్ని పట్టి పీడస్తున్న కరోనావైరస్ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. కరోనా వ్యాక్సిన్లపై ఇప్పటికే అనేక క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

డజన్ల కొద్ది వ్యాక్సిన్లు క్లినికల్ దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ పంపిణీ దిశగా కొనసాగుతోంది. రష్యా నుంచి మరో రెండో వ్యాక్సిన్ ట్రయల్స్ సన్నాహాలు మొదలయ్యాయి.



ఈ పరిస్థితుల్లో ప్రపంచమంతా వ్యాక్సిన్ అందాలంటే కొన్ని బిలియన్ల డోస్ ల అవసరం ఉందని అంటున్నారు నిపుణులు. 2021 తొలి త్రైమాసికంలో కరోనా వ్యాక్సిన్లు ఒకటి కంటే ఎక్కువ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సైద్ధాంతిక సలహాదారు Sir Jeremy Farra ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ ఏడాది 2020లో డిసెంబర్ క్రిస్మస్ నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రిస్మస్ ఎప్పటిలా సాధారణ క్రిస్మస్ కాకపోయే అవకాశం ఉందన్నారు.



ప్రస్తుత డేటాల ప్రకారం.. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో యూకేలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో వచ్చే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. వచ్చే కొత్త ఏడాదిలో కరోనా ట్రీట్ మెంట్స్‌తో పెద్ద మార్పులు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.



వచ్చే ఏడాది ప్రారంభంలో Oxford యూనివర్శిటీలో భారీ మొత్తంలో వ్యాక్సిన్ మోతాదులను ఆస్ట్రాజెనెకా తయారుచేయనుందని ఇంగ్లాండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ Jonathan Van-Tam తెలిపారు. ఇప్పటికే వేలాది మంది NHS సిబ్బందికి వ్యాక్సిన్ తయారీలో శిక్షణ ఇచ్చారు. క్రిస్మస్ తర్వాత ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.



Oxford/AstraZeneca వ్యాక్సిన్ మూడో దశ ఫలితాలు రాబోయే నవంబర్ ఆఖరులో వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్ Van-Tam పేర్కొన్నారు. మరో మల్టీనేషనల్ డ్రగ్ కంపెనీ Pfizer ఇప్పటికే బెల్జియంలోని తన ప్లాంట్‌లో వందలాది వ్యాక్సిన్ మోతాదులను తయారుచేసింది.



ఈ ఏడాదిలో 100మిలియన్ల డోస్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. యూకేలో మాత్రం 40 మిలియన్ల డోస్ లు అందుబాటులోకి రానున్నాయి. 2021 నాటికి 1.3 బిలియన్ల మోతాదులను ఉత్పత్తి చేసే దిశగా ప్లాన్ చేస్తోంది.