Dengue Fever : డెంగ్యూ జ్వరంతో జాగ్రత్త.. ఈ సింపుల్ 5 నివారణ చర్యలతో సురక్షితంగా ఉండొచ్చు!

Dengue Fever : డెంగ్యూ జ్వరం సర్వసాధారణం. ప్రతి సీజన్‌లో సురక్షితంగా ఉండటానికి మీకు సాయపడే కొన్ని నివారణ దశలు ఉన్నాయి. దోమల బారి నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Dengue Fever _ Stay Safe With These Simple Preventive Measures

Dengue Fever : డెంగ్యూ జ్వరం అనేది దోమల వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్.. త్వరగా అందరికి వ్యాపిస్తుంది. అయినప్పటికీ, కొన్ని సాధారణ నివారణ చర్యల ద్వారా వ్యాప్తిని కొంతవరకు నియంత్రించడంలో సాయపడుతుంది. ప్రతి సంవత్సరం కొన్ని సీజన్లలో డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతాయి. డెంగ్యూ జ్వరం జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, వికారం వంటి లక్షణాలతో ప్రారంభమవుతాయి. డెంగ్యూ నివారణ చర్యల్లో ప్రధానంగా దోమల పెంపకం, దోమ కాటును అరికట్టడానికి అనేక చర్యలు ఉంటాయి. వీటిలో కొన్ని మీకోసం అందిస్తున్నాం. డెంగ్యూ జ్వరం సాధారణ నివారణ చర్యలను ఓసారి పరిశీలిద్దాం..

డెంగ్యూ జ్వరం సాధారణ నివారణ చర్యలివే :

1. దోమ కాటును అరికట్టండి :
దోమ కాటును నివారించేందుకు పూర్తి చేతులకు బట్టలు ధరించండి. నిద్రపోతున్నప్పుడు సమయంలో మీ శరీర భాగాలన్నింటినీ కవర్ చేయడానికి దోమతెరను ఉపయోగించవచ్చు. మెరుగైన రక్షణ కోసం మీరు దోమల రిపిల్లెంట్స్ కూడా ఉపయోగించవచ్చు.

Read Also : Bone and Joint Health Tips : శీతాకాలంలో ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

2. ఇంటి లోపల సురక్షితంగా ఉంచండి :
దోమల ఇండోర్ పెంపకానికి దోహదపడే అనేక అంశాలు ఉన్నాయి. డెంగ్యూ వ్యాప్తిని అరికట్టడానికి మీ ఇంటిని శుభ్రపరచడం మొదటిది. దోమల వృద్ధికి నిలువ నీరే ప్రాథమిక ఆధారం. అందుకే, నీరు చేరే అవకాశం ఉన్న కుండలు లేదా కంటైనర్‌లను శుభ్రం చేయడం మర్చిపోవద్దు. అలాగే, నీటిని ఇంటి ఆవరణంలో నిల్వ చేయరాదు.

Dengue Fever

3. ఇంటి తలుపులు, కిటికీలను మూసివేయండి :
తెరిచిన తలుపులు, కిటికీల నుంచి మీ ఇంట్లోకి నేరుగా దోమలు వస్తాయి. ఉపయోగంలో లేనప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచండి. మీకు కిటికీ లేదా తలుపులు విరిగిపోయినట్లయితే, ముఖ్యంగా డెంగ్యూ వ్యాప్తి చెందుతున్న సమయంలో వెంటనే మరమ్మతులు చేయించండి.

4. డెంగ్యూ లక్షణాలను గుర్తించండి :
డెంగ్యూ లక్షణాలను ముందస్తుగా గుర్తించడం, చికిత్స చేయడం వల్ల పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్లలో నొప్పి, శరీరంపై దద్దుర్లు వంటివి కొన్ని సాధారణ లక్షణాలుగా చెప్పవచ్చు.

5. మీ పిల్లలను దోమల నుంచి రక్షించండి :
పిల్లలు ఎక్కువ సమయం ఆరుబయట ఆడుతుంటారు. తద్వారా దోమకాటుకు గురవుతుంటారు. అందువల్ల, మీ పిల్లలకి పూర్తి చేతుల బట్టలు ఉండేలా జాగ్రత్త తీసుకోండి. దోమలు కుట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోండి. అలాగే, దోమలు వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆరుబయట కంటే ఇండోర్ గేమ్‌లు మెరుగ్గా ఉంటాయి.

Read Also : Gut Health Tips : చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన 8 ఆహారాలివే.. తప్పక తెలుసుకోండి !

ట్రెండింగ్ వార్తలు