Jamun Fruit Disadvantages: షుగర్ కంట్రోల్ పండు.. కానీ ఎక్కువైతే ప్రమాదమే.. డాక్టర్స్ ఎం చెపుతున్నారంటే?

Jamun Fruit Disadvantages: నేరేడి పండు సహజమైన మూత్రవిసర్జకంగా పనిచేస్తుంది. కానీ, అధికంగా తినడం వల్ల తరచూ మూత్ర విసర్జన కావడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవచ్చు.

Health problems caused by eating apricots

నేరేడి పండు అంటే ఇష్టపడని వారు ఉండరు. షుగర్ పేషేంట్స్ కి ఇదొక వరం. ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ కంట్రోల్, జీర్ణవ్యవస్థకు మేలు చేయడంలో, రక్తాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. అయితే.. కొంతమంది ఆరోగ్య నిపుణులు చెప్తున్నా మాట ఏంటంటే? నేరేడి పండ్లు ఆరోగ్యానికి మంచిదే కానీ అధికంగా తినడం వల్ల కొన్ని దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి ఆ దుష్పరిణామాలు ఏంటి? నేరేడి పండు ఏ పరిమాణంలో తినాలి? ఏ సమయంలో తినాలి అనేది తెలుసుకుందాం. Also Read: మోకాళ్ల నొప్పా? బరువు తగ్గట్లేదా? రోజూ 15 నిమిషాలు ఇలా వెనక్కి నడిస్తే అద్భుతాలు జరుగుతాయి!

నేరేడి పండుతో జీర్ణ సమస్యలు: నేరేడి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తింటే అజీర్తి, గ్యాస్, పొత్తికడుపు నొప్పి, ఉబ్బసం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మూత్ర సంబంధిత సమస్యలు: నేరేడి పండు సహజమైన మూత్రవిసర్జకంగా పనిచేస్తుంది. కానీ, అధికంగా తినడం వల్ల తరచూ మూత్ర విసర్జన కావడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవచ్చు. ఇది డీహైడ్రేషన్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవచ్చు: డయాబెటిస్ ఉన్నవారు నేరేడి పండ్లు ఒక వరం. ఇది రక్తంలో చక్కర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. కానీ, ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అతి తక్కువ స్థాయికి చేరే ప్రమాదం ఉంది. ఇది మలబద్ధకం, మైకం, అలసటకు దారి తీస్తుంది. Also Read: దిండుతో నిద్రపోతున్నారా? ఈ ఒక్క తప్పు మీ మెడ నొప్పి, వెన్నునొప్పికి కారణం కావచ్చు!

అలర్జీ సమస్యలు: కొంతమందికి నేరేడి పండ్లను తినడం అలర్జీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువగా తింటే చర్మంపై ర్యాష్‌లు, వాంతులు, నోటిలో అలర్జీ లక్షణాలు రావచ్చు.

రక్తస్రావ సమస్యలు: నేరేడి పండుకి రక్తాన్ని పలుచగా చేసే లక్షణం ఉంటుంది. కాబట్టి, ఆపరేషన్, లేదా రక్తస్రావ సంబంధిత సమస్యలతో బాధపడేవారు దీన్ని అధికంగా తీసుకోకూడదు.

నేరేడి పండ్లు ఎలా తీసుకోవాలి?

రోజుకి కేవలం 5 నుంచి 8 నేరేడి పండ్లు మాత్రమే తినాలి.

ఖాళీ కడుపుతో నేరేడి పండ్లు తినకూడదు. మధ్యాహ్న భోజనం తరువాత తీసుకోవడం మంచిది.

నేరేడి పండు ఆరోగ్యానికి మంచిదే కానీ, ఏదైనా ఆహారాన్నైనా మితంగా తీసుకుంటే మందులాగా అధికంగా తీసుకుంటే విషంగా మారుతుంది. కాబట్టి నేరేడి పండ్ల విషయంలో పైన తెలిపిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.