Sleeping With A Pillow Mistakes: దిండుతో నిద్రపోతున్నారా? ఈ ఒక్క తప్పు మీ మెడ నొప్పి, వెన్నునొప్పికి కారణం కావచ్చు!
Sleeping With A Pillow: ఈ చిన్న మార్పులతో మెడ, వెన్ను నొప్పులకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన నిద్రను మీ సొంతం చేసుకోండి.

Are you Sleeping With A Pillow: మనలో చాలా మందికి తల కింద మెత్తటి దిండు లేనిదే నిద్ర పట్టదు. అదొక అలవాటుగా మారిపోయింది. కొందరైతే రెండు దిండ్లు కూడా వాడుతుంటారు. కానీ, మీరు రోజూ ప్రేమగా వాడే ఆ దిండే మీ మెడ, వెన్ను నొప్పులకు కారణం అవుతుందంటే నమ్ముతారా?
అవును, నిపుణుల ప్రకారం దిండు వాడకం అనేది పూర్తిగా మనం నిద్రించే భంగిమపై ఆధారపడి ఉంటుంది. ఏ పొజిషన్‌లో పడుకున్నప్పుడు దిండు వాడాలి, ఎప్పుడు వాడకూడదో తెలుసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ కీలక విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. Also Read: వర్షాకాలంలో రాగి జావతో ఆరోగ్యం.. తప్పకుండా తాగండి.. ఎన్నో ప్రయోజనాలు
దిండు లేకుండా ఎప్పుడు పడుకోవాలి?
వెల్లకిలా, అంటే నేరుగా పడుకునే అలవాటు ఉన్నవారికి దిండు వాడకపోవడమే మంచిది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
దిండు లేకుండా పడుకున్నప్పుడు మీ తల, మెడ, వెన్నెముక ఒకే సరళరేఖపై సహజంగా ఉంటాయి. దీనివల్ల వెన్నెముకపై ఎలాంటి ఒత్తిడి పడదు.
మరీ ఎత్తైన దిండు వాడితే మెడ వంగి, వెన్ను పట్టేసినట్లు అవుతుంది. దిండును తీసేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
మెడ భాగంలో రక్తనాళాలపై ఒత్తిడి తగ్గి, శరీరమంతటా రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
దిండు తప్పనిసరిగా ఎప్పుడు వాడాలి?
కానీ, ఒక పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారు మాత్రం దిండును తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే అప్పుడు మెడకు నెలకు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. దానివల్ల మెడ సరిగా సెట్ అవదు. కాబట్టి, ఆ సమయంలో మెత్త పెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి ప్రభావం వెన్నెముకపై పడదు. Also Read: చికెన్ తో కొత్త సమస్య.. క్యాన్సర్ కంటే ప్రమాదం.. ఇది తెలుసుకోండి
మీ భంగిమే కీలకం
కాబట్టి, దిండు వాడాలా వద్దా అనేది మీ వ్యక్తిగత అలవాటు కాదు, మీ నిద్ర భంగిమపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వెల్లకిలా పడుకుంటే.. దిండు వాడకండి లేదా చాలా పలుచని దిండు వాడండి. అలాగే పక్కకు తిరిగి పడుకుంటే.. మీ భుజం ఎత్తుకు సరిపడా దిండును తప్పక వాడండి.
ఈ చిన్న మార్పులతో మెడ, వెన్ను నొప్పులకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన నిద్రను మీ సొంతం చేసుకోండి.