Chicken Side Effects: చికెన్ తో కొత్త సమస్య.. క్యాన్సర్ కంటే ప్రమాదం.. ఇది తెలుసుకోండి
చికెన్ ను వారంలో 300 గ్రాముల కన్నా ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబందించిన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి.

Chicken
Eating Chicken Side Effects: చికెన్.. ఇది చాలా ముందుకి ఇష్టమైన వంటకం. చాలా మందికి ఇది రోజువారీ ఆహరంలో భాగమైపోయింది. అంతలా చికెన్ తినడాన్ని ఇష్టపడతారు. కానీ, చికెన్ తినడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. దీనికి అధికంగా తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని ఇప్పటికే ధృవీకరించబడింది. ఇక చికెన్ పై తాజాగా జరిగిన పరిశోధనలు మరో భయంకరమైన విషయాన్ని ధ్రువీకరించాయి. చికెన్ తినడం వల్ల క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధి వ్యాప్తి చెందుతుందట. మరి అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. Also Read: వర్షాకాలంలో రాగి జావతో ఆరోగ్యం.. తప్పకుండా తాగండి.. ఎన్నో ప్రయోజనాలు
చికెన్ ను వారంలో 300 గ్రాముల కన్నా ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబందించిన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో వచ్చిన ఓ అధ్యయనం మేరకు.. క్యాన్సర్ కారణంగా జరిగే మరణాల కన్నా చికెన్ అధిక వినియోగం వల్ల జరిగే మరణాలే ఎక్కువగా ఉన్నాయట. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. 19 సంవత్సరాల పాటు జరిగిన ఈ అధ్యయనంలో 4,000 మందికి పైగా పాల్గొన్నారు. వారిలో వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారిలో 100 గ్రాముల కంటే తక్కువ తినేవారి కంటే 27 శాతం ఎక్కువ మరణ ప్రమాదం ఉందని తేలింది. పురుషుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందట. కోడి మాంసం అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందట. Also Read: వాటర్ బాటిల్స్ అస్సలు అలా క్లీన్ చేయకండి? చాలా డేంజర్.. ఒకసారి ఇలా ట్రై చేయండి
కొల్హాపూర్‌కు చెందిన డాక్టర్ అవినాష్ షిండే చెప్పిన ప్రకారం.. నిజానికి చికెన్ మంచి పోషకమైన ఆహారం. కానీ, అధిక వినియోగాన్ని నివారించాలి. చికెన్‌లో ప్రోటీన్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దాని ఎలా వండుతున్నారనేది ప్రధానం అంటున్నారు. వేయించిన, ప్రాసెస్ చేసిన చికెన్ ఆరోగ్యానికి చాలా హానికరం అని సూచించారు. కాబట్టి, వారానికి 100 గ్రాముల కంటే తక్కువ చికెన్ తినడం సురక్షితం. దానికన్నా ఎక్కువ తినాలనుకున్నప్పుడు వేయించడానికి బదులుగా ఉడకబెట్టడం లేదా గ్రిల్ చేయడం మంచిది. అలాగే, దానిని ఫైబర్ అధికంగా ఉండే ఆహారంలో చేర్చుకోవడం మరియు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.