Water bottle cleaning: వాటర్ బాటిల్స్ అస్సలు అలా క్లీన్ చేయకండి? చాలా డేంజర్.. ఒకసారి ఇలా ట్రై చేయండి

వాటర్ తో నార్మల్ గా కడుగుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం అని నిపుణులు చెప్తున్నారు.

Water bottle cleaning: వాటర్ బాటిల్స్ అస్సలు అలా క్లీన్ చేయకండి? చాలా డేంజర్.. ఒకసారి ఇలా ట్రై చేయండి

Water bottle cleaning

Updated On : June 15, 2025 / 6:56 AM IST

వాటర్ బాటిల్ వాడకం అనేది ప్రస్తుతం సమాజంలో చాలా సహజం. ఇంట్లో నీళ్లు తాగడానికి, పిల్లల స్కూల్ కోసం, కారులో ఇలా ప్రతీచోట వాటర్ బాటిల్ వాడుతున్నారు. నిజానికి, వాటర్ బాటిల్ వాడటం చాలా ప్రమాదం. అందులో ఉండే కెమికల్స్ నెమ్మదిగా నీళ్లలో కలిసిపోయే అనేకరకాల వ్యాధులు, క్యాన్సర్ ను వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ, వాటర్ బాటిల్ వాడకం తగ్గలేదు కాబట్టి.. కనీసం వాడుతున్న బాటిల్స్ అయినా శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. చాలా మంది వాటర్ బాటిల్స్ ను చాలా కాలం వరకు శుభ్రం చేయకుండా అలానే వాడుతుంటారు.

ఒకవేళ చేసినా వాటర్ తో నార్మల్ గా కడుగుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం అని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు.. వాటర్ బాటిల్ ను ఎలా శుభ్రం చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలనేది కూడా చెప్పారు. మరి ఆ విషయాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాటర్ బాటిల్ బయటకు శుభ్రంగా కనిపించినప్పటికీ, దాని లోపల వివిధ రకాల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో అలాగే నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.

కాబట్టి, బాటిల్ శుభ్రం చేయడం కోసం బాటిల్ బ్రష్ ను వాడటం మంచి అలవాటు. ఇది బాటిల్ లోపల పేరుకుపోయిన బ్యాక్తీరియాను తొలగిస్తుంది. బాటిల్స్ ను ఎక్కువకాలం శుభ్రం చేయకుండా వాడటం వల్ల లోపల జిగట లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదం. దాని నార్మల్ గా నీళ్ల తో కడగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి బాటిల్ బ్రష్ వాడాలి. బాటిల్ ను వారానికి శుభ్రపరచాలి. ముందుగా బాటిల్ ని వేడి నీటితో నింపి అందులో కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి పైకి క్రిందికి బలంగా కదిలించాలి. తర్వాత బ్రష్ తో మళ్ళీ శుభ్రం చేసి నీటితో బాగా కడగాలి. ఇలా చేయడం బాటిల్ శుభ్రం అవుతుంది.