Ragi Java Benefits: వర్షాకాలంలో రాగి జావతో ఆరోగ్యం.. తప్పకుండా తాగండి.. ఎన్నో ప్రయోజనాలు
Ragi Java Benefits: రాగులలో సహజంగా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢత్వానికి సహాయపడుతుంది.

Ragi java
Ragi Java Benefits: మనలో చాలా మందికి రాగి జావా తాగే అలవాటు ఉంటుంది. ఎండాకాలం లాగానే రాగి జాను తాగడం స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే.. రాగి జావా తాగడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి. కానీ, ఎండాకాలం ముగియగానే మళ్ళీ రాగి జావా తాగడం ఆపేస్తారు. కానీ, వర్షాకాలంలో కూడా రాగి జవాను తాగమని సూచిస్తున్నారు నిపుణులు. దీనివల్ల అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మందగిస్తుంది. అలాగే గాలిలో ఉండే తేమ కారణంగా మన మెటబాలిజం తగ్గుతుంది. అలా వర్షాకాలంలో రాగి జావా తాగడం వల్ల ఇంకా చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలే ఉన్నాయి. Also Read:చికెన్ తో కొత్త సమస్య.. క్యాన్సర్ కంటే ప్రమాదం.. ఇది తెలుసుకోండి
రాగులలో సహజంగా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢత్వానికి సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎముకలు విరిగిన వారికి రాగి జావను తాగించడం వల్ల అవి త్వరగా అతుక్కునే అవాకాశం ఉంటుంది. రాగుల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించి రక్తాన్ని వృద్ధి చెందేలా చేస్తుంది. రంగుల్లో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ గా పనిచేసి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది. క్యాన్సర్ కారకాలను నిర్ములిస్తుంది. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.Also Read: వాటర్ బాటిల్స్ అస్సలు అలా క్లీన్ చేయకండి? చాలా డేంజర్.. ఒకసారి ఇలా ట్రై చేయండి
రాగి జావను రోజువారీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ నశిస్తాయి. దానివల్ల డయేరియా వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వర్షాకాలంలో చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు, రాగి జావను తాగడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి, అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. రాగుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అందుకే వర్షాకాలంలోనూ కచ్చితంగా రాగి జావను తాగాలి.