Drinking this healthy drink daily improves eye health
Healty Drink: మన శరీరంలో కళ్ల ఆరోగ్యం ప్రధానమైనది. అందుకే సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. కానీ, కళ్ల ఆరోగ్యం అనేది మన దైనందిన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్, మొబైల్ స్క్రీన్లను ఎక్కువగా ఉపయోగించడం, ఆరోగ్యరాహిత్యమైన ఆహారం తీసుకోవడం వల్ల కంటి దృష్టి బలహీనత, పొడి కళ్ల సమస్యలు, చూపు మందగించడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ సమస్యలతో భాదపడుతున్నారు. కానీ, మన రోజువారీ జీవితంలో చేసుకునే చిన్న మార్పు వల్ల కళ్ల సమస్యలను నయం చేసుకోవచ్చు. అందులో ఒక జ్యూస్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. అదే క్యారెట్ జ్యూస్(Healty Drink). ఇది నిజంగా మ్యాజికల్ జ్యూస్ అనే చెప్పాలి. మరి క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కళ్లకు కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
AC Side Effects: ఏసీకి అలవాటు పడితే అంతే సంగతులు.. ఈ సమస్యలు రావడం ఖాయం
క్యారెట్‌లో దాగి ఉన్న పోషకాలు:
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే కంటి ఆరోగ్య ప్రయోజనాలు:
1.రాత్రి సమయంలో చూపు మెరుగుపడుతుంది:
బీటా కెరోటిన్ ద్వారా విటమిన్ ఏ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది రాత్రిపూట స్పష్టంగా చూసే శక్తిని అందిస్తుంది.
2.పొడి కళ్ల సమస్యలు తగ్గుతాయి:
విటమిన్ ఏ కంటి లోపల తేమను నిలుపుతుంది. రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి పొడిబారడం తగ్గుతుంది.
3.చూపు మందగించకుండా నిరోధించగలదు:
క్యారెట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటిలో కణజాలాన్ని రక్షించి, వృద్ధాప్యం వచ్చే చూపు సమస్యలను దూరం చేస్తుంది.
Diabetes In Children: పిల్లల్లో డయాబెటీస్ ప్రమాదం.. ఈ 5 రకాల ఫుడ్ తో మొత్తం కంట్రోల్ చేయొచ్చు
4.మాక్యులర్ డిజెనరేషన్ ప్రమాదం తగ్గుతుంది:
క్యారెట్‌లో ఉండే లూటిన్, జీఝాంటిన్ వంటి పదార్థాలు దీర్ఘకాలిక కంటి సమస్యల రాకుండా కంటిని రక్షిస్తాయి.
5.కంటి అలసట, వత్తిడి తగ్గుతుంది:
కంప్యూటర్, మొబైల్స్ ఎక్కువగా వాడేవారు క్యారెట్ జ్యూస్ తీసుకుంటే కంటికి సహజ శక్తి, తాజాతనం లభిస్తుంది.
క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి?
క్యారెట్లను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని మిక్సీలో వేసి కొద్దిగా నీరు కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. దానిని ఫిల్టర్ చేసి తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. ఈ జ్యూస్ ఉదయం ఖాళీ కడుపుతో, మధ్యాహ్నం భోజనానికి ముందుగా తాగడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి. ఇలా వారానికి 4 నుంచి 5 సార్లు తాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.