Eating these 5 types of foods will detoxify the body
ఆరోగ్యకరమైన జీవితానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అత్యంత అవసరం. మనం రోజూ తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది లేదా చెడగొడుతుంది. ప్రజెంట్ జనరేషన్లో ప్రాసెస్డ్ ఫుడ్, కలుషితమైన వాతావరణం, జంక్ ఫుడ్ లాంటి వాటివల్ల శరీరం విషపదార్థాలతో నిండిపోతుంది. ఈ విషపదార్థాలు రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. కాబట్టి, అలాంటి విషపదార్థాలను శరీరం నుండి బయటకు పంపించాలి. అందుకోసం డీటాక్స్ ఆహారం చాలా అవసరం. మరి ఇప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేసే అతి ప్రధానమైన 5 రకాల పదార్థాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
1.లేత నిమ్మకాయ (Lemon):
నిమ్మకాయ రుచికి పుల్లగా ఉన్నప్పటికీ ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తాగడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది, కాలేయం శుభ్రపడుతుంది.
2.అల్లం (Ginger):
మనం రోజు తీసుకునే ఆహారాన్ని అల్లం ఒకటి. అల్లం శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేసే గుణాన్ని కలిగి ఉంది. ఇది వాంతులు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అల్లం టీ లేదా అల్లం ముక్కలను నీటిలో మరిగించి తీసుకోవడం ద్వారా శరీరం చక్కగా శుభ్రమవుతుంది.
3.ఆపిల్ సిడర్ వినెగర్ (Apple Cider Vinegar):
వినెగర్ శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది అకాలేయం (liver) పనితీరును మెరుగుపరుస్తుంది. గ్లూకోజ్ స్థాయిని నియంత్రించి, శరీరంలో ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు ఉదయం ఒక స్పూన్ ఆపిల్ సిడర్ వినెగర్‌ను నీటిలో కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
4.గ్రీన్ టీ (Green Tea):
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన మాలిక్యూల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీలో ఉండే క్యాటచిన్స్ అనే పదార్థాలు కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రతి రోజు ఒకటి లేదా రెండు కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల డీటాక్స్ ప్రక్రియ వేగవంతమవుతుంది.
5.కొత్తిమీర (Coriander / Cilantro):
కొత్తిమీరను చాలా మంది పక్కన పెట్టేస్తారు. కానీ, ఇది శరీరంలో హేవీ మెటల్స్ ను తొలగించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటంతో పాటు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. కూరల్లో, సలాడ్స్ లో, జ్యూస్ రూపంలో కొత్తిమీరను తీసుకోవచ్చు.
బాడీ డీటాక్స్ అనేది ఒకేసారి జరిగే ప్రక్రియ కాదు. దానిని మన జీవనశైలిలో భాగం చేసుకోవాలి. పైన చెప్పిన ఆహార పదార్థాలను మీ రోజువారీ డైట్ లో చేర్చడం ద్వారా మీరు మీ శరీరాన్ని హానికరమైన టాక్సిన్స్ నుండి కాపాడుకోవచ్చు. సరైన ఆహారం, యోగా, వ్యాయామం ఇవన్నీ కలిపి శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసి ఆరోగ్యాన్ని పెంపొందించగలవు.