Hair Health Tips: బట్టతల బాధిస్తోందా.. అరటి ఆకులతో ఇలా చేయండి.. మంచి ఫలితాలు

అరటి ఆకులలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు, పోలిఫెనోల్స్, ఇతర శక్తివంతమైన పోషక పదార్థాలు ఉంటాయి.

Hair Health Tips: బట్టతల బాధిస్తోందా.. అరటి ఆకులతో ఇలా చేయండి.. మంచి ఫలితాలు

Good results with banana leaves for baldness problem

Updated On : July 4, 2025 / 10:24 AM IST

బట్టతల.. ప్రస్తుత యువతకు పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య చాలా మందిలో మానసికంగా బాధిస్తుంది. నలుగురిలోకి వెళ్ళడానికి కూడా ఇష్టడపడనంతగా తమను తాము ఆత్మన్యూనతా భావంలోకి నెట్టేసుకుంటున్నారు. ఈ సమస్యకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. హార్మోన్స్ అసమతుల్యత, జన్యుపరమైన సమస్యలు, హారపు అలవాట్లు, విపరీతమైర కాలుష్యం, మానసిక ఆందోళనల కారణంగా కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య నివారణ కోసం రకరకాల షాపులు, ఆయిల్స్, మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేక ఇబ్బందిపడుతున్నారు. అయితే, అరటి ఆకులతో బట్టతలకు చక్కని పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెప్తున్నారు. మరి అరటి ఆకులు బట్టతలకు ఎలాంటి ప్రయోజనం చేస్తాయి? దానిని ఎలా వాడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి ఆకులతో జుట్టు ఆరోగ్యం:

అరటి ఆకులలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు, పోలిఫెనోల్స్, ఇతర శక్తివంతమైన పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా తలపై నున్నని తేమను కల్పిస్తాయి. తలపై ఉండే చర్మాన్ని శుభ్రపరుస్తాయి. జుట్టు మూలాలను బలంగా చేస్తాయి. కొత్త జుట్టు పెరిగేలా చేస్థాయి. జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తాయి.

అరటి ఆకుల పేస్ట్ తయారీ విధానం:

ముందుగా 4 లేదా 5 అరటి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి, కొద్దిగా నీరు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా సరిపడా కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలపై, జుట్టులో సమానంగా అప్లై చేసుకోవాలి. అలా 30 నుంచి 45 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత మృదువైన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2 నుంచి3 సార్లు చేయటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. కేవలం అరటి ఆకుల పేస్ట్ మాత్రమే కాదు అరటి ఆకుల డికోక్షన్ (కషాయం) కూడా జుట్టు సమస్యకు బాగా పనిచేస్తుంది. దానిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుల డికోక్షన్ (కషాయం) తయారీ విధానం:

ముందుగా అరటి ఆకులను చిన్న ముక్కలుగా కోసి, వాటిని నీటిలో వేసి 15 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని తలపై పోసుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తల చర్మం శుభ్రపరచడంతో పాటు జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది.

మరిన్ని చిట్కాలు మీకోసం:

  • అరటి ఆకులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వాటిలోఎక్కువగా ప్రోటీన్లు, ఐరన్, బయోటిన్ ఉన్నవాటిని ఎక్కువగా తీసుకోవాలి.
  • నీరు ఎక్కువగా తాగాలి.
  • ఒత్తిడి నియంత్రించుకోవాలి. ధ్యానం, యోగా లాంటివి చేయడం మంచిది.
  • కెమికల్స్ లేని సహజమైన షాంపూలను వాడాలి.

అరటి ఆకులు మనకు సులభంగా లభించే సహజ వనరులు. అవి కేవలం పండ్లకు మాత్రమే కాకుండా ఆరోగ్య సంరక్షణలోనూ ఉపయోగపడతాయి. బట్టతల సమస్యకు సహజమైన పరిష్కారం కావాలంటే, ఈ అరటి ఆకుల చికిత్సను ప్రయత్నించండి. మంచి ఫలితాలు లభిస్తాయి.