Red Wine Benefits: రెడ్ వైన్ తో గుడ్ హెల్త్.. రోజుకో గ్లాస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

డ్ వైన్ తాడగం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అది కూడా మితంగా తాగితే మాత్రమే.

Red Wine Benefits: రెడ్ వైన్ తో గుడ్ హెల్త్.. రోజుకో గ్లాస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Health benefits of drinking red wine

Updated On : June 4, 2025 / 12:25 PM IST

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ, రెడ్ వైన్ తాడగం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అది కూడా మితంగా తాగితే మాత్రమే. నిజానికి రెడ్ వైన్ ని వివిధ రకాల ద్రాక్ష పండ్లతో తయారు చేస్తారు. ద్రాక్షను యాంటీఆక్సిడెంట్లతో కలిపి పులియబెట్టడం ద్వారా రెడ్ వైన్ తయారవుతుంది. కాబట్టి అందులో అనేకరకాల ప్రయోజనానున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ద్రాక్షను పులియబెట్టి తయారుచేసే రెడ్ వైన్ లో ఉండే సమ్మేళనాలు మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను నియంత్రిస్తాయి. దానివల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రెజెంట్ జనరేషన్ చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. వారికి ఒత్తిడిని తగ్గించడంలో రెడ్ వైన్ సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గిపోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర శరీరానికి అందుతుంది. ఎముకల బలానికి కూడా రెడ్ వైన్ సహాయపడుతుందట.

చర్మ సౌందర్యానికి కూడా రెడ్ వైన్ సహాయపడుతుంది. ముఖంపై ముడతలు, మొటిమలను తగ్గించి మెరిసేలా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రెడ్ వైన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రెడ్ వైన్‌లోని ఉండే రెస్వెరాట్రాల్ అనే యాంటీ-అలెర్జిక్ కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం అందిస్తుంది.

టైప్ – 2 డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో కూడా రెడ్ వైన్‌ అద్భుతంగా పనిచేస్తుంది. టైప్ – 2 డయాబెటీస్‌తో ఇబ్బంది పడేవారు వైద్యుల సలహా మేరకు రెడ్ వైన్ తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. రెడ్ వైన్‌లో ఆల్క హాల్ శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి లివర్ పై ఎలాంటి ప్రభావం పడకుండా ఆరోగ్యం ఉంటుంది. అదేవిదంగా క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో కూడా రెడ్ వైన్ సహాయ పడుతుంది. మితంగా రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది.