Honey Soaked Onion: తేనెలో నానబెట్టిన ఉల్లితో షుగర్ మాయం.. ఇంకా ఎన్నో లాభాలు.. మీరు కూడా ట్రై చేయండి
Onion Honey Benefits: తేనెలో నానబెట్టిన ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, క్వర్సెటిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది.

Onion in honey benefits
ఉల్లిపాయలు లేకుండా కూరలు చేయలేము. చాలా మంది దీనిని చాలా రకాలుగా తింటారు. కానీ, మీరు ఎప్పుడైనా ఉల్లిపాయను తేనెలో నానబెట్టుకొని తిన్నారా? చెప్తుంటేనే కాస్త వింతగా ఉంది కదా. కానీ, ఇలా తినడం వల్ల అనేకరకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయట. మరి అని ఏంటి? అనేది ఇప్పడు తెలుసుకుందాం. తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలను తినడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. దగ్గు, జలుబు, జ్వరం రాకుండా చేస్తుంది. ఇలాంటివాటికి ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పుండ్లు, గాయాలు త్వరగా మానిపోతాయి. అంతేకాకండా ఈ మిశ్రమం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
తేనెలో నానబెట్టిన ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, క్వర్సెటిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. కాబట్టి ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడంతోపాటు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో ఈ మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో క్రోమియం డయాబెటీస్ ను తగ్గించడంలో ప్రభావ వంతంగా పనిచేస్తుంది. శరీరం ఇన్సులిన్‌ను ఉపయోగించుకునేలా ప్రేరేపిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇంకా ఇందులో ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు రోగ కణాలను తగ్గిస్తాయి.
తేనే, ఉల్లి మిశ్రమంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. అంతేకాదు ఇందులో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ క్యాన్సర్ కారకాలను తగ్గిస్తుంది. కణాలకు నష్టం జరగకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ మిశ్రమం దగ్గు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. గొంతులో గరగర, గొంతు సమస్యలని సైతం నయం చేస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది.