Energy Drinks Disadvantages: ORS, ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగుతున్నారా.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.. ఇవి తెలుసుకోండి

Energy Drinks Disadvantages: ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (Oral Re hydration Solution). ఇది నీరు, ఉప్పు, చక్కెర మొదలైన పదార్థాలతో తయారు చేసిన ఒక ద్రావణం.

Energy Drinks Disadvantages: ORS, ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగుతున్నారా.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.. ఇవి తెలుసుకోండి

Health problems caused by ORS and energy drinks

Updated On : June 30, 2025 / 2:36 PM IST

ఈ మధ్య కాలంలో ఓఆర్ఎస్ లు, ఎనర్జీ డ్రింకులు తాగడం ఫ్యాషన్ గా మారింది. కొంచం అలసటగా అనిపించినా వెంటనే ఎనర్జీ డ్రింకులు తాగేస్తున్నారు. కొంతమంది ఆరోగ్యానికి మంచిదే కదా అని అవసరం లేకపోయినా ఈ డ్రింకులు తాగుతున్నారు. అయితే, ఇలా అధికంగా ఓఆర్ఎస్ లు, ఎనర్జీ డ్రింకులు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. మరి ఎనర్జీ డ్రింకులు ఎందుకు మన ఆరోగ్యానికి మంచిది కాదు? తాగడం వల్ల ఏం జరుగుతుంది? ఒకవేళ తాగితే ఏ మోతాదులో తాగాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఓఆర్ఎస్ అంటే ఏంటి?

ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (Oral Rehydration Solution). ఇది నీరు, ఉప్పు, చక్కెర మొదలైన పదార్థాలతో తయారు చేసిన ఒక ద్రావణం. వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్(శరీరంలోని నీరు, లవణాలు తగ్గిపోవడం) వంటివి జరిగినప్పుడు శరీరంలో తగ్గిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు తిరిగి అందించడానికి దీనిని ఉపయోగిస్తారు.

ఓఆర్ఎస్, ఎనర్జీ డ్రింకులు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:

1.హృదయ సంబంధిత సమస్యలు:
ఓఆర్ఎస్, ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల గుండె సమస్యలు, హార్ట్‌బీట్ పెరగడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది గుండె ఆరోగ్యాని తగ్గిస్తుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

2.బీపీ పెరగడం:
ఈ పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా పెరుగుతుంది. హైబీపీ వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది.

3.నిద్రలేమి, మానసిక ఆందోళన:
ఓఆర్ఎస్, ఎనర్జీ డ్రింకులు మెదడుపై అధిక ప్రభావం చూపిస్తుంది. అది నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇది మనిషి మానసిక ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తుంది.

4. చక్కెర ప్రభావం:
ఒక్క బాటిల్ ఎనర్జీ డ్రింక్‌లో 5 నుంచి 8 టీస్పూన్ల చక్కెర ఉండొచ్చు. ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా ప్రమాదం. ఇవి ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగడం, కాల్షియం శోషణ లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి.

5.దంత సమస్యలు:
ఓఆర్ఎస్, ఎనర్జీ డ్రింకులలో ఆమ్లం, చక్కెర అధికంగా ఉన్నందున ఇది దంతాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా పళ్లు పుచ్చిపోవడం, పంటి సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంది.

6.లివర్, కిడ్నీపై ప్రభావం:
తరచూ ఇలాంటి ఎనర్జీ డ్రింకులు ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీర అవయవాలపై ఒత్తిడిని పెరుగుతుంది. ముఖ్యంగా కాలేయ ఆరోగ్యానికి ఈ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

ORS వాడకం అవసరమైతే మాత్రమే (ఉదాహరణకు విరేచనాలు, వాంతులు ఉన్నప్పుడు) వాడాలి. తినే ఆహారంలో నుంచే సాధ్యమైనంత వరకు శరీరానికి లవణాలు, నీరు అందించాలి. ఎనర్జీ డ్రింకులు తాత్కాలిక ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి వాడకాన్ని పరిమితం చేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం మంచిది.