ఆ పిల్లలు క్షేమం : ఘటనపై విచారణ కమిటీ

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 06:23 AM IST
ఆ పిల్లలు క్షేమం : ఘటనపై విచారణ కమిటీ

హైదరాబాద్ : నాంపల్లి అర్బన్ ఏరియా ఆస్పత్రి ఘటనలో అస్వస్థతకు గురైన చిన్నారులు క్షేమంగా ఉన్నారు. వ్యాక్సినేషన్ తర్వాత ఇచ్చే ప్యారాసిటమాల్ ట్యాబ్ లెట్ కు బదులు ట్రెమడాల్ మాత్రలు ఇవ్వడంతో 34 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులకు నీలోఫర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం వారిలో చాలా మంది కోలుకున్నారు. వారిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. ఆరోగ్యం కుదుటపడిన చిన్నారులను ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నారు.

ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఘటనపై విచారణకు ఆదేశించింది. ఎనిమిది మంది నిపుణులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. మార్చి 18 వ తేదీ లోపు కమిటీ రిపోర్టు అందిచాల్సివుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ వైద్య శాఖ సిద్ధంగా ఉంది. ఈ ఘటనలో ముగ్గురు ఏఎన్ ఎమ్స్, ఫార్మాసిస్టులు, హెల్త్ సెంటర్ లో ఉన్న డ్యూటీ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలని, వారిపై సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఈమేరకు వారిపై మార్చి 9 శనివారం చర్యలు తీసుకోనున్నారు. 

ట్రెమడాల్ ట్యాబ్ లెట్స్ సప్లైని ఆపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై వైద్య శాఖ నిన్న, మొన్న సమీక్షలు జరిపారు. ట్రెమడాల్ ట్యాబులెట్ సప్లైని ఆపేసి, ఇంతకముందే బ్యాన్ చేసిన ఈ ట్యాబ్ లెట్స్ ను ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సీహెచ్ సీలకు పంపకూడదని నిర్ణయం తీసుకున్నారు.