Pneumonia : న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
కొన్ని లక్షణాల ద్వారా న్యుమోనియా వచ్చినట్లు గుర్తించవచ్చు. కఫంతో కూడిన దగ్గు, చలిజ్వరం, ఛాతీనొప్పితో, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, బలహీనంగా, నీరసంగా, శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించటం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

pneumonia
Pneumonia : ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధిని న్యుమోనియాగా పిలుస్తారు. చిన్నపిల్లలలో, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో, గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి వంటి వైద్య సమస్యలను కలిగి ఉన్నవారిలో సాధారణంగా వస్తుంది. అలాగే ఆసుపత్రిలో చేరిన రోగులు, ఎక్కువ కాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందిన వారికి ,ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తులకు, హెచ్ ఐవి,ఎయిడ్స్, క్యాన్సర్, అవయవ మార్పిడి చికిత్సలు పొందిన వారికి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా
న్యూమోనియా బారినపడే అవకాశాలు ఉంటాయి.
వైరస్లు, బ్యాక్టీరియా మరియు కొన్నిసార్లు శిలీంధ్రాలు వంటి వివిధ రకాల సూక్ష్మజీవుల వల్ల న్యుమోనియా వస్తుంది. న్యుమోనియాకు అత్యంత సాధారణ బ్యాక్టీరియా కారణంగా చెప్పవచ్చు. దీనినే స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా గా పిలుస్తారు.. హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా, లెజియోనెల్లా న్యుమోఫిలా మరియు స్టెఫిలోకాకస్ ఆరియస్ ఇతర బాక్టీరియా. మైకోప్లాస్మా వంటి ఇతర బ్యాక్టీరియా తేలికపాటి న్యుమోనియాకు కారణమౌతాయి.
కొన్ని లక్షణాల ద్వారా న్యుమోనియా వచ్చినట్లు గుర్తించవచ్చు. కఫంతో కూడిన దగ్గు, చలిజ్వరం, ఛాతీనొప్పితో, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, బలహీనంగా, నీరసంగా, శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించటం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. న్యుమోనియా అంటువ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం మరియు తుమ్మడం వల్ల క్రిములు మనం పీల్చే గాలిలోకి వ్యాప్తి చెందుతాయి. దగ్గేటప్పుడు మరియు తుమ్మేటప్పుడు ముక్కు మరియు నోటిని కవర్ చేసుకోవాలి. వ్యాధితో బాధపడుతున్నవారు ప్రత్యేక ప్లేట్లు, కప్పులు మరియు ఇతర పాత్రలను ఉపయోగించడం మంచిది. సామాజిక దూరం పాటించాలి.
ఈ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని జాగ్రత్తులు పాటించటం మంచిది. నీరు, సూప్ లు, టీ తాగటం మంచిది . తేనె, కొన్ని చుక్కల నిమ్మకాయతో తయారు చేసిన వెచ్చని పానీయం ఉపశమనం కలిగిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అలసటకు గురయ్యే పనులు చేయకూడదు. సకాలంలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. ఏమాత్రం అశ్రద్ధ మంచిది కాదు.