Women with this problem should not eat broccoli at all.
బ్రోకలీ (Broccoli).. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పచ్చి కూరగాయలలో ఒకటి. ఇందులో విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఈ కూరగాయను రోజూవారి తినడం వల్ల అనేకరకాల పోషకాలు శరీరానికి అందుతాయి. షుగర్ కంట్రోల్, గుండె, కాలేయం వంటి వాటికి ఆరోగ్యాన్ని అందించండంలో ఇది మేలు కూరగాయ అని చెప్పవచ్చు. అయితే, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మహిళలు ఈ బోకలే ను తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. కొంతమంది మహిళలో ఇది విషయంగా పనిచేస్తుంది అని అంటున్నారు. మరి ఆ ప్రత్యేకమైన సందర్భాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.థైరాయిడ్ సమస్య:
బ్రోకలీ అనేది కాలిఫ్లవర్, కాబేజీ వంటి క్రూసిఫెరస్ (Cruciferous) కూరగాయలలో ఒకటి. దీనిలో గోయిత్రోజెన్స్ (Goitrogens) అనే పదార్థాలు అధికంగా ఉంటాయి. ఈ పదార్థాలు థైరాయిడ్ గ్రంథిలో ఆయోడిన్ శోషణను తగ్గించే అవకాశముంది. కాబట్టి, హైపోథైరాయిడిజం ఉన్న మహిళలు, ముఖ్యంగా ఆయోడిన్ లోపం ఉన్నవారు ఎక్కువగా బ్రోకలీ తింటే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని మరింతగా దెబ్బతీయవచ్చు. ఒకవేళ తినాలనుకుంటే మాత్రం పచ్చిగా కాకుండా ఉడికించి తినడం మంచిది. ఉడకబెట్టడం వలన గోయిత్రోజెన్స్ ప్రభావం తగ్గుతుంది.
2.ఇరిగబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS)/గ్యాస్ సమస్యలు:
బ్రోకలీ లో పుష్కలంగా ఉన్న ఫైబర్ కొందరికి జీర్ణ సమస్యలు కలిగించవచ్చు. ఇందులో ఉన్న ఫోడ్మాప్స్ అనే కార్బోహైడ్రేట్లు కొందరికి పొత్తికడుపు నొప్పి, ఊబకరం, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం లాంటి సమస్యలు కలిగించవచ్చు. కాబట్టి, IBS ఉన్నవారు, గ్యాస్ లేదా బ్లోటింగ్ సమస్య ఉన్నవారు దీనిని తినకపోవడం మంచిది.
3.గర్భిణీ, డెలివరీ స్త్రీలు:
బ్రోకలీ ఎక్కువగా తినడం వల్ల గర్భిణీ, డెలివరీ స్త్రీలకు గ్యాస్, అజీర్ణం సమస్యలు రావచ్చు. అలాగే శిశువుకు కూడా తల్లి పాల ద్వారా ప్రభావం ఉండే అవకాశముంది. ఒకవేళ తిన్నా కూడా మితంగా, ఉడికిన రూపంలో తినడం మంచిది.
4.యాంటీకాగ్యులెంట్స్ మందులు వాడేవారు:
బ్రోకలీ లో విటమిన్ K అధికంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. బ్లడ్ థిన్నింగ్ మందులు (వారఫరిన్ వంటి) వాడేవారు ఎక్కువ విటమిన్ K తీసుకుంటే, మందుల ప్రభావం తగ్గుతుంది.