చిన్నప్పటి ఫొటోలతో బ్లాక్ మెయిల్, పెళ్లి చేసుకొమ్మని వేధింపులు

స్కూల్, కాలేజీ రోజుల్లో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను స్నేహితురాలితో కలిసి సాన్నిహిత్యంగా ఫొటోలు దిగాడు. వాటితో పాటు ఆ యువతికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోలను కూడా..

చిన్నప్పటి ఫొటోలతో బ్లాక్ మెయిల్, పెళ్లి చేసుకొమ్మని వేధింపులు

Updated On : October 31, 2019 / 5:04 AM IST

స్కూల్, కాలేజీ రోజుల్లో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను స్నేహితురాలితో కలిసి సాన్నిహిత్యంగా ఫొటోలు దిగాడు. వాటితో పాటు ఆ యువతికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోలను కూడా..

చిన్ననాటి స్నేహితుడు అనే చనువుతో ప్రవర్తిస్తే దానిని దుర్వినియోగపరచి సోషల్ మీడియా వేదికగా స్నేహితురాలిని రచ్చకీడ్చాడు ఓ వ్యక్తి. ఐడీఏ జీడిమెట్ల సుభాశ్ నగర్‌లో ఉండే మేడిశెట్టి శ్రీకాంత్ అలియాస్ అర్జున్‌ చిన్ననాటి క్లాస్ మేట్‌తో పరిచయం పెంచుకున్నాడు. 

స్కూల్, కాలేజీ రోజుల్లో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను స్నేహితురాలితో కలిసి సాన్నిహిత్యంగా ఫొటోలు దిగాడు. వాటితో పాటు ఆ యువతికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోలను కూడా తీసుకున్నాడు. కొద్ది రోజులుగా ఆమె ఫొటోలను వాట్సాప్ స్టేటస్ లుగా, ఫేస్ బుక్ లలో కించపరిచేలా పోస్టు చేస్తున్నాడు. 

దీంతో మహిళ రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. తాను కాలేజీలో చదువు కారణంగా ఆ వ్యక్తితో కలవడం, మెసేజ్ చేయడం కుదరలేదని తెలిపింది. ఆ కారణంగానే తనపై ద్వేషం పెంచుకుని వేధించడం మొదలుపెట్టినట్లు ఆమె తెలిపింది. ఇంటికి తలుపులు కొట్టి బూతులు తిట్టాడని, పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేశాడని పోలీసులకు వెల్లడించింది. పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.