పోలీసులకు రిక్వెస్ట్: లవర్‌ను కలవాలి.. పర్మిషన్ ఇవ్వండి

పోలీసులకు రిక్వెస్ట్: లవర్‌ను కలవాలి.. పర్మిషన్ ఇవ్వండి

Updated On : April 7, 2020 / 6:51 AM IST

కరోనా వ్యాప్తి అడ్డుకోవడానికి లాక్‌డౌన్ అమలు చేస్తున్నా అడ్డదారుల్లో తిరిగేస్తున్నారు. దొరికితే అడ్డమైన కారణాలు చెప్పి బయటపడాలనుకుని పోలీసుల చేతిలో బుక్కయిపోతున్నారు. ఇదిలా ఉంటే, నేరుగా స్టేషన్ కు వెళ్లి తనకు బాయ్‌ఫ్రెండ్‌ను చూడాలని ఉందని అక్కడికి వెళ్లేందుకు పర్మిషన్ కావాలని ఓ యువతి స్టేషన్ మెట్లెక్కింది. 

యువతి రిక్వెస్ట్ చూసి బంజారాహిల్స్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అంబర్‌పేటకు చెందిన యువకుడు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివాసముంటున్న యువతి ప్రేమించుకున్నారు. ఆదివారం ఆ యువకుడు బంజారాహిల్స్‌కు వచ్చాడు. వారిద్దరు కలిసి ఉండటం చూసిన అమ్మాయి తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

తమ బిడ్డను వేధిస్తున్నాడంటూ కేసు పెట్టారు. ఎందుకొచ్చావని పోలీసులు అడిగితే, ఆమెను ప్రేమించడంలేదని చెప్పడానికే వచ్చానన్నాడు. పోలీసులు హెచ్చరించిన పంపేశారు. కాసేపటికి యువతి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తాను ఆ కుర్రాడిని కలవాల్సిందేనని స్టేషన్లో కూర్చుంది. పర్మిషన్ కావాల్సిందేనని డిమాండ్ చేసింది. ఉన్నతాధికారులు, ఆమెకు లాక్‌డౌన్ నిబంధనల గురించి వివరించి, ఈ తరహా ప్రవర్తన తాము ఒప్పుకోమని సర్ది చెప్పారు.

Also Read | నేనొక Idiot , లాక్‌డౌన్‌ను ఉల్లంఘించా: న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి. పదవి ఊడాల్సిందేకాని, కరోనా రక్షించింది.