బిగ్ బాస్ 3 విజేత : బార్బర్ షాప్ పెడుతా – రాహుల్

ఉత్కంఠభరితంగా సాగిన బిగ్‌బాస్-3 సీజన్లో అనూహ్యంగా టైటిల్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ చాలా సంతోషంగా ఉందంటూ అరుపులు కేకలతో తెలిపాడు. ప్రైజ్ మనీతో బార్బర్ షాప్ పెడతానని ఇటీవలే రాహుల్ ప్రకటించడంతో అతడి సింప్లిసిటీ, కులవృత్తి మీదున్న గౌరవాన్ని అందరూ అభినందిస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్-3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. 50 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది.
ఎన్నో అంచనాలతో జులై 22న 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ…అట్టడుగు స్థాయి నుంచి సెలబ్రిటీగా ఎదిగానని… ఈ విజయం తనను పది మెట్లు పైకి తీసుకెళ్లిందని చెప్పాడు. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాహుల్ పాదాభివందనాలు చేశారు రాహుల్. ఇక నుంచి తన లైఫ్ కొత్తగా ఉండబోతుందని చెప్పారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 2019, నవంబర్ 03వ తేదీ ఆదివారం గ్రాండ్‌గా ముగిసింది. అండర్‌డాగ్‌గా బిగ్‌హౌస్‌లోకి ఎంటరైన రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్.. విన్నర్‌గా కాలర్ ఎగరేశాడు. డౌన్‌టూ ఎర్త్ పర్సనాలిటీతో ఓట్లు కొల్లగొట్టాడు. దీంతో టైటిల్ ఫెవెరెట్‌గా హౌస్‌లో సందడి చేసిన పటాకా శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 50లక్షల నగదు బహుమతిని, బిగ్‌బాస్ ట్రోఫిని రాహుల్ అందుకున్నాడు. మొత్తంగా 8 కోట్ల 52లక్షల ఓట్లు పోలైనట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో బిగ్‌బాస్-3కి ఎండ్‌కార్డ్ పడింది.
Read More : బిగ్ బాస్ సీజన్ 3.. అలీ రెజా అవుట్