సమ్మెకు దిగుతున్న ఓలా,ఊబర్ డ్రైవర్లు

  • Published By: venkaiahnaidu ,Published On : October 17, 2019 / 03:50 AM IST
సమ్మెకు దిగుతున్న ఓలా,ఊబర్ డ్రైవర్లు

Updated On : October 17, 2019 / 3:50 AM IST

ఓ వైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సమయంలో ఓలా,ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులకు మరో షాక్ ఇవ్వబోతున్నారు. ఓలా,ఊబర్,వివిధ ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు అక్టోబర్-19,2019నుంచి నిరవధిక నిరాహార దీక్షకు రెడీ అయ్యారు. వివిధ డిమాండ్లతో వారు సమ్మెకు దిగుతున్నారు.

దాదాపు 50వేల క్యాబ్ లో ఈ సమ్మె కారణంగా నిలిపోనున్నాయి. ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ కి తమ డిమాండ్ల లిస్ట్ ను గతంలో అందించామని తెలంగాణ స్టేట్ ట్యాక్సీ,డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ షేక్ సలాలుద్దీన్ తెలిపారు. అదేవిధంగా ఊబర్,ఐటీ కంపెనీలకు కూడా డిమాండ్ ల లిస్ట్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

కిలోమీటరుకు కనీసం 22 రూపాయల ఛార్జీలు వసూలు చేయడం ద్వారా మెరుగైన జీవన పరిస్థితులు, పని ప్రమాణాలను నిర్ధారించడానికి ఉబెర్, ఓలా క్యాబ్‌లు మరియు ఇతర టాక్సీ అగ్రిగేటర్ సేవలను అమలు చేయడం వంటివి వారి డిమాండ్ లలో ఉన్నాయి. డ్రైవర్లందరికీ కనీస వ్యాపార హామీని నిర్ధారించేలా అగ్రిగేటర్ మార్కెట్ ప్రదేశాలకు అనుసంధానించబడిన క్యాబ్‌ల సంఖ్యపై పరిమితి విధించడం వంటి డిమాండ్లలో ఉన్నాయి.