పల్లె పోరు షురూ : ఒంటరిగానే అంటున్న సార్

  • Published By: madhu ,Published On : January 2, 2019 / 04:55 AM IST
పల్లె పోరు షురూ : ఒంటరిగానే అంటున్న సార్

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు ఒక్కటై మహాకూటమిగా ఏర్పడినా టీఆర్ఎస్‌ని ఏమి చేయలేకపోయారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో గులాబీ మరింత వికసించింది. దీనితో మహాకూటమిలో ఉన్న పార్టీలు అంతర్మథనం..పోస్టుమార్టం నిర్వహించుకుంటున్నాయి. ప్రధానంగా టీజేఎస్‌కి ఘోర పరాభవం ఏర్పడింది. ప్రభావం చూపిస్తామని బీరాలు పలికిన ఆ పార్టీ నేతలు ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో టీజేఎస్ దానిపై ఫోకస్ పెట్టింది. 

ప్రయోజనాల కోసమే కూటమి…
మహాకూటమిగా వద్దని…ఒంటరిగానే బరిలోకి దిగాలని కోదండరాం సార్…నిర్ణయించారు. సంస్థాగత ఎన్నికలకు ఒంటిరగానే వెళితేనే పార్టీని బలోపేతం చేసుకోగలుగుతామని..అందుకే ఒంటరి సన్నాహాలు చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు కోదండరాం వెల్లడించారు. మహాకూటమి నుండి బయటకు వచ్చే అంశంపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పడిందని..సైద్దాంతికంగా కూటమి కొనసాగుతుందని చెప్పారు. కూటమి ఏర్పడే సమయానికి లేట్ అయిపోయిందని పేర్కొన్న‘సార్’…సరైన ప్రణాళికలను రచించలేపోయామన్నారు.