సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే జైలు శిక్షా : హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 04:10 AM IST
సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే జైలు శిక్షా  : హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది

Updated On : February 20, 2019 / 4:10 AM IST

హైదరాబాద్‌: సెల్ ఫోన్ మాట్లాడుతు డ్రైవింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త మీరు జైలుకెళ్లే అవకాశముంది. హా..ఏంటి ఫోన్ మాట్లాడుతు డ్రైవింగ్ చేస్తే..ఫైన్ పడుతుంది కానీ ఏకంగా జైలు శిక్ష ఏంటీ అనుకుంటున్నారా? జోక్ కాదు ఇది నిజం.  సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకం అని తెలుసు..నిబంధనలు పాటించకపోవటం..దానికి ఫైన్ విధించటం..గురించి విన్నాం..కానీ సెల్ ఫోన్ మాట్లాడుతు డ్రైవింగ్ చేశాడనే కారణంతో ఓ యువకుడికి ఏకంగా జైలు శిక్ష విధించటం సంచలనంగా మారింది. ఈ ఘటన హైదరాబాద్ లోనే జరిగింది. ఈ తీర్పుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలుశిక్ష రద్దు చేయడం గమనించాల్సిన విషయం.  ఈ ఘటన హైదరాబాద్ నగరంలోనే జరిగింది.

హైదరాబాద్ లో భరద్వాజ అనే యువకుడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. తరువాత సైబరాబాద్ నాలుగో మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టగా..జడ్జిగారు భరద్వాజకు నాలుగు రోజుల జైలుశిక్ష విధించారు. ఈ తీర్పును సవాల్  చేస్తూ భరద్వాజ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.దీనిపై జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భరద్వాజ నిబంధనలను ఉల్లంఘించటం తప్పే గానీ ..అతని డ్రైవింగ్ తో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదన్న విషయాన్ని అయినా పరిగణనలోకి తీసుకుని కింది కోర్టు జరిమానా విధించి ఉండాల్సిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 

జైలుకెళ్లి వచ్చిన తరువాత సొసైటీలో సదరు యువకుడి భవిష్యత్ గురించి క్రింది కోర్టు ఊహించి ఉండాల్సిందని..అలాగే అతని  కుటుంబ స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ కేసుపై తీర్పునిచ్చిన న్యాయాధికారులు ఒక్క రోజు జైలులో ఉండి వస్తే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని క్రింది కోర్టు జడ్జిలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారం ఉందని ఇలా దుర్వినియోగానికి పాల్పడకూడదని హెచ్చరించింది. ఓ తీర్పు వెలువరించే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని తాము మాటిమాటికీ చెబుతూనే న్యాయమూర్తులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.