తాగి నడిపితే ఉద్యోగం ఊడుతుంది : విద్యుత్ ఉద్యోగులకు వార్నింగ్
హైదరాబాద్ : మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా.. మందుబాబులు మాత్రం వినిపించుకోవడం లేదు. తాగి రోడ్డెక్కుతున్నారు. డ్రంక్ డ్రైవింగ్ చేసి

హైదరాబాద్ : మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా.. మందుబాబులు మాత్రం వినిపించుకోవడం లేదు. తాగి రోడ్డెక్కుతున్నారు. డ్రంక్ డ్రైవింగ్ చేసి
హైదరాబాద్ : మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా.. మందుబాబులు మాత్రం వినిపించుకోవడం లేదు. తాగి రోడ్డెక్కుతున్నారు. డ్రంక్ డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎదుటివాళ్లను ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నారు. ఇలాంటి మందు బాబులు ట్రాన్స్ కోలో చాలా మందే ఉన్నారట. దీంటో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాగి నడిపితే ఉద్యోగం ఊడిపోతుందని అని హెచ్చరించారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. రోడ్డు భద్రత విషయంలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, మద్యం సేవించి వాహనాలు నడిపే సంస్థ ఉద్యోగులు, ఆర్టిజన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు మే 4వ తేదీన ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
కొందరు విద్యుత్ ఉద్యోగులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని ఫిర్యాదులు వచ్చినట్టు ప్రభాకర్ రావు తెలిపారు. హైదరాబాద్ నగర శివారులో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఆర్టిజన్‌గా పనిచేస్తున్న ఓ విద్యుత్ ఉద్యోగి మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతడికి పోలీసులు రూ.1200 ఫైన్ వేశారు. అంతటితో ఊరుకోలేదు.. విషయాన్ని ట్రాన్స్‌కో సీఎండీకి తెలిపారు. ఆ ఆర్టిజన్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న సీఎండీ… విద్యుత్ ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేశారు.
ఏపీ విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) నిబంధనల ప్రకారం విద్యుత్ ఉద్యోగులు మద్యం, డ్రగ్స్ తీసుకుని విధులకు హాజరైనా, మద్యం మత్తులో బహిరంగ ప్రదేశాల్లో కనిపించినా చర్యలు తీసుకుంటారు. 2017 నవంబర్ 17న జారీ చేసిన ఆర్టిజన్ల సర్వీసు నిబంధనల ప్రకారం మద్యం, డ్రగ్స్ తీసుకుని విధులకు హాజరైనా, అల్లర్లకు పాల్పడినా, దురుసుగా ప్రవర్తించినా వారిని ఉద్యోగం నుంచి తొలగించవచ్చని చెప్పారు. ఇకపై విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు కేర్ ఫుల్ గా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. లేదంటే ఉద్యోగం ఊడిపోతుందన్నారు. ఆ తర్వాత బాధ పడినా ప్రయోజనం లేదన్నారు.