పెద్దమ్మతల్లి గుడిలో భక్తుల కిటకిట

దసరా పండుగ సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో ఉదయం నుంచే భక్తుల రద్ది భారీగా పెరిగిపోయింది. అయితే శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు 10 రోజులు 10 అలంకారాలతో దర్శనమిస్తారు. ఈ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు.
ఇక భక్తులందరూ వివిధ రూపాల్లో అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. కొంతమంది బోనం ఎత్తుకుని వచ్చి మొక్కులను చెల్లించుకుంటున్నారు. అంతేకాదు ఆలయంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.