హైదరాబాద్ లో రష్యన్ యువకుల హల్ చల్ : ఇద్దరికి గాయాలు

హైదరాబాద్ లో రష్యన్ యువకులు హల్ చల్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రష్యన్ దేశస్తుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర గాయాలయ్యే పరిస్థితి నెలకొంది. ఫుల్ గా మద్యం తాగిన నలుగురు రష్యన్ దేశస్తులు వారిలో వారే గొడవ పడ్డారు. అదికాస్తా ఘర్షణకు దారి తీసింది. తీవ్రంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. తన్నుకున్నారు. దీంతో ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టూరిస్ట్ ప్లేస్ గా మంచి పేరు తెచ్చుకున్న హైదరాబాద్ కు ఎంతోమంది విదేశస్తులు వస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు వచ్చిన రష్యన్ యువకుల మద్య ఓ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. పైగా వారు మద్యం తాగి ఉండటంతో విచక్షణ మరచిన నలుగురు యువకులు ఒకరిపై మరొకరు దాడుకులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి.