కుమ్మేసింది : హైదరాబాద్‌లో భారీ వర్షం
ఉపరితల ద్రోణి ప్రభావంతో జనవరి 26 శనివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో జనవరి 26 శనివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో జనవరి 26 శనివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులుు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ అర్ధరాత్రి సమీక్షించారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్‌ను ఫోన్‌లో ఆదేశించారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ బృందాలను ఇతర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సీఎంకు కమిషనర్ వివరించారు. పరిస్థితులను కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వివరించారు.
ఉపరితల ద్రోణి కారణంగా ఆది, సోమవారాల్లో సైతం అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. విదర్భ తూర్పు ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఉత్తర, దక్షిణ భారతాల నుంచి వీస్తున్న గాలులు కలయికల వల్ల వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి.